ఆయనతో కలిసి మినీ డేట్ లో పాల్గొన్న మెగా డాటర్.. వీడియో వైరల్!

మెగా డాటర్ నిహారిక( Niharika ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో నటిగా నిర్మాతగా ఎంతో బిజీగా ఉన్నారు.

ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తున్నటువంటి నిహారిక మరోవైపు వరస సినిమాలకు వెబ్ సిరీస్ లకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ కెరియర్ లో దూసుకుపోతున్నారు.

ఇక నిహారిక సినీ కెరియర్ పక్కన పెట్టి వ్యక్తిగత విషయానికి వస్తే ఈమె ఇది వరకే వివాహం చేసుకొని రెండు సంవత్సరాలకి తన భర్త నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే.

ఇలా తన భర్తకు విడాకులు ఇచ్చిన నిహారిక తిరిగి తన కెరియర్ పై ఫోకస్ పెట్టారు.

"""/" / ఇలా ఒంటరిగా ఉన్నటువంటి ఈమె తరచూ తన స్నేహితులతో కలిసి ఎంతో ఎంజాయ్ చేస్తూ తిరుగుతూ ఉంటారు.

అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలను కూడా నిహారిక సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.

అయితే తాజాగా ఈమె ఓ వ్యక్తితో కలిసి డేట్( Date) కి వెళ్లినట్టు సోషల్ మీడియా వేదికగా ఒక క్యూట్ వీడియోని షేర్ చేశారు.

ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.మరి నిహారిక డేట్ కి వెళ్లిన ఆ వ్యక్తి ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే.

"""/" / నిహారిక తన తండ్రి నాగబాబు( Nagababu ) తో కలిసి మినీ డేట్ ప్లాన్ చేశారు.

నిహారికకు తన తండ్రి అంటే చాలా ఇష్టం ఆయనకు కూడా తన కూతురు అంటే పంచప్రాణాలు అనే సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే తన తండ్రితో కలిసి మినీ డేట్ కి వెళ్లిన ఈమె ఒకరిపై మరొకరు ప్రేమను వ్యక్తం చేశారు అంతేకాకుండా ఒకరిపై మరొకరు ముద్దుల వర్షం కురిపించుకున్నారు.

ఇలా ఈ తండ్రి కూతురి మధ్య ఉన్నటువంటి ప్రేమ అనుబంధం ఈ వీడియోలోనే తెలిసిపోతుంది.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక నాగబాబు ప్రస్తుతం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గా రాజకీయాలలోనూ అలాగే నిర్మాతగా ఇండస్ట్రీలోనూ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

బాహుబలి2 రికార్డులను బ్రేక్ చేయడం కల్కికి సాధ్యమేనా.. సమస్య ఇదేనంటూ?