Anjana Devi : అంజనమ్మకు కొడుకులంటే అంత ఇష్టమా.. ఇప్పటికీ ఆ పని చేస్తుందా?
TeluguStop.com
సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీలలో మెగా ఫ్యామిలీ ఒకటి మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీలో కొనసాగుతూ స్టార్ సెలబ్రిటీలుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న విషయం మనకు తెలిసిందే.
అయితే చిరంజీవి( Chiranjeevi ) ఎలాంటి సినీనేపథ్యం లేకపోయినా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు.
ఇలా ఇండస్ట్రీలో అంచలంచలుగా ఎదుగుతూ తన వారసులను తన తమ్ముళ్లను ఇండస్ట్రీలోకి ఆహ్వానించి వారికంటూ ఒక మంచి జీవితాన్ని అందించిన ఘనత చిరంజీవికే అని చెప్పాలి.
ఈ విధంగా మెగా కుటుంబానికి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి.ఇకపోతే ఈ ఫ్యామిలీ నుంచి హీరోయిన్గా అడుగు పెట్టినటువంటి వారిలో నిహారిక ఒకరిని చెప్పాలి.
తాజాగా నిహారిక ( Niharika ) ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ తమ ఫ్యామిలీ గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ముఖ్యంగా తన నాన్నమ్మ అంజనా దేవి గురించి మాట్లాడుతూ ఈమె చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
"""/" /
అంజనాదేవి ( Anjana Devi )ముగ్గురు కొడుకులు గురించి చెప్పాల్సిన పనిలేదు ఆ ముగ్గురు కొడుకులు తనకు ఎంతో ముద్దని ఈమె తెలిపారు.
మా నాన్నమ్మ ఇంత వయసు వచ్చినప్పటికీ మా నాన్న వాళ్లకు 60 సంవత్సరాలు వయసు వచ్చినప్పటికీ ఇంకా వారిని చిన్నపిల్లలు గానే చూస్తుందని ఈమె తెలిపారు.
ఇక మా నానమ్మకు తన కొడుకులంటే చాలా ప్రాణం.మా నాన్నకు వర్షంలో తడవడం అంటే చాలా ఇష్టం కానీ తడిస్తే ఎక్కడ ఇబ్బంది పడతారోనని వర్షం వస్తుందంటే చాలు నాన్నమ్మ నుంచి డాడీకి ఫోన్ వస్తుందని నిహారిక తెలిపారు.
వర్షం పడేలాగా ఉంది నాన్న తొందరగా వెళ్ళిపో అంటూ తను ఇప్పటికి ఫోన్ చేసి చెబుతారని నాన్నమ్మ నుంచి ఫోన్ వస్తే మేము నవ్వుకుంటామని తెలిపారు.
మా డాడీకి ఆల్రెడీ 60 సంవత్సరాలు వచ్చాయి నానమ్మ అంటూ ఆట పట్టిస్తామని తెలిపారు.
అంతేకాకుండా తన కొడుకుల పుట్టినరోజుకు ఈమె వారికి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలపడమే కాకుండా తన దగ్గర ఉన్నటువంటి కొంత డబ్బుని వాళ్లకు ఇస్తూ తల్లి ప్రేమ చాటుకుంటుందని తెలిపారు.
"""/" /
ఈ విధంగా తన నాన్నమ్మకు తన కొడుకులంటే ఎంత ఇష్టమో అనే విషయాన్ని నిహారిక తెలియజేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది.
కొడుకులు ఎంత పెద్ద అయినా తల్లి ప్రేమ మారదు కదా అంటూ కొందరు కామెంట్లు చేయగా ఆ ఫ్యామిలీకి చాలా మంచి పేరు ఉంది కానీ మీలాంటి వారి వల్లే ఆ పరువు పేరు ప్రఖ్యాతలు పోతున్నాయి అంటూ ఈ వీడియో పై కామెంట్లు చేస్తున్నారు.
జుట్టును ఒత్తుగా పొడుగ్గా మార్చే దాల్చిన చెక్క.. ఎలా వాడాలంటే?