Niharika Konidela : అలాంటి వారు తోడుంటే లైఫ్ లో ఏదైనా చేసేయొచ్చు.. నిహారిక కామెంట్స్ వైరల్!

మెగా డాటర్ నిహారిక( Mega Daughter Niharika Konidela ) ప్రస్తుతం కెరీర్ పై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టారు.

సాగు అనే షార్ట్ ఫిల్మ్ ఈ నెల 4వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్( Amazon Prime ) లో స్ట్రీమింగ్ కానుండగా ఈ షార్ట్ ఫిల్మ్ కు సంబంధించిన ప్రెస్ మీట్ లో నిహారిక చేసిన కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

ఈ షార్ట్ ఫిల్మ్ మనస్సుకు చాలా దగ్గరైందని ఆమె అన్నారు.ఈ షార్ట్ ఫిల్మ్ లో నాకు బాగా కనెక్ట్ అయిన విషయం ఒకటి ఉందని నిహారిక పేర్కొన్నారు.

లైఫ్ లో మనకు చాలా ఎదురుదెబ్బలు తగులుతూ ఉంటాయని అయితే ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా చింతించకుండా ధైర్యంతో ముందడుగులు వేయాలని ఆమె చెప్పుకొచ్చారు.

"""/"/ నేను సాగు షార్ట్ ఫిల్మ్( Saagu Short Film ) కు ఇంతలా కనెక్ట్ కావడానికి మరో కారణం కూడా ఉందని నిహారిక పేర్కొన్నారు.

మన దగ్గర రైతుల ఆత్మహత్యలు( Farmers Suicide ) ఎక్కువగా ఉంటాయని ఆమె అన్నారు.

ఈ షార్ట్ ఫిల్మ్ లో చెప్పిన ఒక అంశంతో పాటు వేర్వేరు కారణాల వల్ల రైతులు చనిపోతూ ఉంటారని నిహారిక చెప్పుకొచ్చారు.

ఏమైనా పరవాలేదు మేము చూసుకుంటాం అనే కుటుంబం, స్నేహితులు మనకుంటే జీవితంలో ఏదైనా చేసేయొచ్చని నిహారిక కామెంట్లు చేశారు.

నేను బాధలో ఉన్న ప్రతిసారి నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ సపోర్ట్( Friends And Family Support ) చేసి కెరీర్ పరంగా ముందడుగులు వేయడానికి సహాయం చేశారని నిహారిక పేర్కొన్నారు.

ఈ మధ్య కాలంలో నిహారిక వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల ద్వారా ఎక్కువగా వార్తల్లో నిలిచారు.

"""/"/ అయితే ఆ బాధ నుంచి త్వరగా కోలుకోవడానికి కుటుంబ సభ్యులు, స్నేహితులు కారణమని నిహారిక క్లారిటీ ఇచ్చేశారు.

నటిగా, నిర్మాతగా కెరీర్ పరంగా బిజీ అవుతున్న నిహారికకు భవిష్యత్తులో భారీ విజయాలు దక్కాలని నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు.

నిహారిక సొంత బ్యానర్ పై పలు క్రేజీ వెబ్ సిరీస్ లకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

జీవితంలో ఇంకెప్పుడు చెప్పులు వేసుకోను.. షాకింగ్ డేసిషన్ తీసుకున్న బిచ్చగాడు హీరో?