నిహారిక ఇండస్ట్రీ ఎంట్రీ పై చిరు అలా రియాక్ట్ అయ్యారా.. సాహసమే చేసింది?

మెగా డాటర్ నిహారిక( Niharika ) నిర్మాతగా మారి కమిటీ కుర్రాళ్ళు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.

ఈ సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను( Promotional Programs ) నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న నిహారిక ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తన సినీ ఎంట్రీ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ.మా ఫ్యామిలీలో అందరూ కూడా యాక్టింగ్ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి నాకు కూడా నటనపై చాలా ఆసక్తి కలిగిందని తెలిపారు.

"""/" / నాకు సినిమా ఇండస్ట్రీలో కొనసాగడం చాలా ఇష్టమని తెలిపారు.ఇక తాను నటనపై ఆసక్తితోనే పలు సినిమాలలో హీరోయిన్ గా నటించానని నిహారిక వెల్లడించారు.

ఇండస్ట్రీలోకి రావాలని కోరిక ఉండడంతో ఇదే విషయాన్ని నేను ముందుగా పెదనాన్నతో చెప్పాను.

ఇలా ఇండస్ట్రీలోకి వస్తానని పెదనాన్నకు చెప్పగానే పెదనాన్న నాకు కొన్ని సలహాలు ఇచ్చారు.

ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మంచి గుర్తింపు సంపాదించుకుంటే ఎలా అయితే ప్రశంసలు వస్తాయో అదే విధంగా ట్రోల్స్ కూడా వస్తాయి.

"""/" / ఇలా మన గురించి ఎలాంటి కామెంట్లు వినిపించిన ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు.

అంతేకాకుండా తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను కూడా పెదనాన్న నాకు అర్థమయ్యేలా చెప్పారు.

ఇలా పెదనాన్న తన సినీ జర్నీ గురించి నాకు వివరించారు అయితే దేనినైనా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని భావించే నేను ఒక మనసు సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాను అంటూ నిహారిక తన సినీ జర్నీ గురించి వెల్లడించారు.

ఇక మధ్యలో కాస్త బ్రేక్ తీసుకున్నప్పటికీ తిరిగి ప్రస్తుతం నటిగా నిర్మాతగా ఇండస్ట్రీలో బిజీ అవుతున్నారు.

బండ్ల గణేష్ ప్రొడ్యూస్ చేసిన ఆ మూడు సినిమాల్లో ఆ స్టార్ హీరోయిన్ నే పెట్టడానికి కారణం ఏంటి..?