నేను డిప్యూటీ సీఎం తాలూకానే… నిహారిక కామెంట్స్ వైరల్?
TeluguStop.com
మెగా డాటర్ నిహారిక( Niharika ) ప్రస్తుతం కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ఈమె పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్లిన తర్వాత అక్కడ తన భర్తతో అత్తింటి వారితో వచ్చిన విభేదాల కారణంగా తన భర్తకు విడాకులు ఇచ్చి తిరిగి తండ్రి వద్దకు చేరుకున్నారు.
ఇలా విడాకులు( Divorce ) తీసుకున్న తర్వాత నిహారిక పూర్తిగా సినీ కెరియర్ పైనే దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో నిర్మాతగా కొనసాగుతూనే మరోవైపు నటిగా పలు సినిమాలలో కూడా నటిస్తున్నారు.
ఇక నిహారిక ఇప్పటికే పలు వెబ్ సిరీస్ లను కూడా నిర్మించారు. """/" /
ఇదిలా ఉండగా తాజాగా నిహారిక కమిటీ కుర్రోళ్ళు( Committee Kurrollu Movie ) అనే సినిమా ద్వారా నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.
ఈ సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.
ఈ క్రమంలోనే ఇటీవల ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు.ఈ కార్యక్రమానికి సిద్దు జొన్నలగడ్డ( Siddhu Jonnalagadda ) ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
"""/" /
ఇక ఈ కార్యక్రమంలో నిహారిక నిర్మాతగా మాట్లాడటానికి మైక్ అందుకోగానే ఒక్కసారిగా ఆడిటోరియంలో ఉన్న వారందరూ కూడా పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పేరును ప్రస్తావిస్తూ పెద్ద ఎత్తున కేకలు వేశారు.
నిహారిక మాట్లాడటానికి కూడా అవకాశం లేకుండా బాబులకే బాబు కళ్యాణ్ బాబు అంటూ పవన్ పై తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ఇక కాసేపు సైలెంట్ అయిన నిహారిక మీరు మాత్రమే కాదండి నేను కూడా డిప్యూటీ సీఎం( Deputy CM ) గారి తాలూకానే అని చెప్పడంతో ఒక్కసారిగా అభిమానులు కేకలు వేస్తూ గోల చేశారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ ఈ సినిమా ఈవెంట్లో తనని భాగం చేసినందుకు నిహారికకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలపడమే కాకుండా చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్ తెలిపారు.
Hajper Customer Support And Service Quality: A Practical Guide For UK Players