మెగా డాటర్ కు షాకిచ్చిన రాజమౌళి.. ఆ ప్రాజెక్ట్ రిలీజ్ చేయొద్దని క్లారిటీగా చెప్పేశారా?

స్టార్ డైరెక్టర్ రాజమౌళి( Star Director Rajamouli ) జడ్జిమెంట్ సినిమాల విషయంలో పూర్తిస్థాయిలో పర్ఫెక్ట్ గా ఉంటుంది.

ఏ సినిమా హిట్ అవుతుందో ఏ సినిమా ఫ్లాప్ అవుతుందో ఆయన అంచనా వేయగలరు.

కమిటీ కుర్రోళ్లు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిహారిక ఆసక్తికర విషయాలను వెల్లడించగా ఆ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.

నిహారిక మాట్లాడుతూ యాక్టింగ్ అంటే నాకెంతో ఇష్టమని తెలిపారు.నటిగా రాణించాలని నేను ఎప్పటినుంచో అనుకుంటున్నానని పలు లఘు చిత్రాలలో కూడా యాక్ట్ చేశానని నిహారిక తెలిపారు.

విశ్వక్ సేన్ ( Vishwak Sen )హీరోగా యాక్ట్ చేసిన ఒక షార్ట్ ఫిల్మ్ కోసం నన్ను హీరోయిన్ గా అడిగారని నిహారిక పేర్కొన్నారు.

కొన్ని కారణాల వల్ల ఆ షార్ట్ ఫిల్మ్ కు ఒక సాంగ్ వరకు మాత్రమే నేను వర్క్ చేశానని ఆమె చెప్పుకొచ్చారు.

అఖిల్ హీరోగా జక్కన్న కొడుకు కార్తికేయ ( Karthikeya )డైరెక్షన్ లో తెరకెక్కిన షార్ట్ ఫిల్మ్ లో హీరోయిన్ గా చేశానని నిహారిక తెలిపారు.

"""/" / రాజమౌళి ఆ షార్ట్ ఫిల్మ్ ( Short Film )ను చూసి ఆ షార్ట్ ఫిల్మ్ ను రిలీజ్ చేయకపోవడమే మంచిదని సూచించారని నిహారిక చెప్పుకొచ్చారు.

అదే నా తొలి షార్ట్ ఫిల్మ్ అని నిహారిక పేర్కొన్నారు.నాకు సినిమాల్లోకి రావాలని ఉందని ఒకసారి పెదనాన్నకు చెప్పానని నిహారిక తెలిపారు.

పెదనాన్న సినిమాల్లోకి వస్తే ప్రశంసలతో పాటు నెగిటివిటీని సైతం ఎదుర్కోవాలని ఉంటుందని చెప్పారని నిహారిక పేర్కొన్నారు.

"""/" / ఇండస్ట్రీలో వాతావరణం ఎలా ఉంటుందో పెదనాన్న నాకు వివరించారని నిహారిక వెల్లడించారు.

అంతా విన్నాక కొంచెం భయం వేసినా సినిమాల్లోకి రావాలని అనిపించిందని ఆమె చెప్పుకొచ్చారు.

ఆ తర్వాత ఒక మనసు స్క్రిప్ట్ విని అందులో పాత్ర నచ్చి వెంటనే ఒప్పేసుకున్నానని నిహారిక తెలిపారు.

ఫస్ట్ వీక్ కలెక్షన్లతో ఆ రికార్డును సొంతం చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్.. ఏమైందంటే?