అర్హ  వసపిట్ట.. అల్లు అర్జున్ కూతురు పై నిహారిక కామెంట్స్ వైరల్!

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి నటుడు అల్లు అర్జున్ ( Allu Arjun ) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ఈయన తన వ్యక్తిగత జీవితంలో కూడా చాలా సంతోషంగా ఉన్నారు.

ఇక అల్లు అర్జున్ స్నేహారెడ్డి( Sneha Reddy ) దంపతులకు ఇద్దరు సంతానం అనే సంగతి మనకు తెలిసిందే.

ఇక వీరి గారాల పట్టి అల్లు అర్హ  అందరికీ ఎంతో సుపరిచితమే ఈమె ఇంత చిన్న వయసులోనే ఇప్పటికే బాలనటిగా వెండితెరపై సందడి చేశారు.

"""/"/ ఇలా బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి ఈమె ఇంత చిన్న వయసులోనే భారీ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఇక అల్లు అర్హ ( Allu Arha ) అల్లరి గురించి అల్లు అర్జున్ పలు సందర్భాలలో తెలియజేసిన సంగతి తెలిసిందే.

అర్హ ఇంట్లో కనుక ఉంటే ఇల్లు మొత్తం సందడి సందడిగా ఉంటుందని నాన్ స్టాప్ గా మాట్లాడుతూ ఉంటుందని అల్లు అర్జున్ పలు సందర్భాలలో తెలియజేశారు.

అయితే నిహారిక( Niharika ) సైతం ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో అల్లు అర్హ అల్లరి గురించి బయట పెట్టారు.

"""/"/ అల్లు అర్హ మా వస పిట్ట అంటూ నిహారిక తెలియజేశారు.ఎప్పుడు చూడు మాట్లాడుతూనే ఉంటుందని నిహారిక వెల్లడించారు.

మా ఇంట్లో నన్ను అత్త అని అందరూ పిలిస్తే అర్హ మాత్రం పిన్ని( Pinni ) అని పిలుస్తుందని తెలియజేశారు.

ఇక తన వద్దకు వచ్చి ఈ రింగ్ ఎక్కడ కొన్నావ్ ఈ డ్రెస్ ఎక్కడ కొన్నావ్ చాలా బాగుంది నా డ్రెస్ ఎలా ఉంది బాగుంది కదా అంటూ క్వశ్చన్ తనే అడుగుతుంది ఆన్సర్ కూడా తానే చెబుతుందని నిహారిక తెలిపారు.

అర్హ చాలా తెలివైన అమ్మాయని చాలా క్యూట్ క్యూట్ గా( Cute Girl ) మాట్లాడుతూ ఉంటుంది అంటూ నిహారిక చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

పైసా ఖర్చు లేకుండా ఇలా చేస్తే వైట్ అండ్ బ్రైట్ స్కిన్ మీ సొంతం!