ఆ హీరో అయితే ఓకే… పెళ్ళికాని హీరో పై మనసులో కోరిక బయటపెట్టిన మెగా డాటర్!

నిహారిక కొణిదెల( Niharika Konidela ) ప్రస్తుతం తన మొదటి సినిమా కమిటీ కుర్రాళ్ళు( Committee Kurrollu ) సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు.

నిహారిక మొదటిసారి నిర్మాతగా మారి ఈ చిత్రాన్ని నిర్మించారు.ఇప్పటికే పలు వెబ్ సిరీస్లను నిర్మించిన నిహారికకు ఇదే మొదటి సినిమా కావటం విశేషం.

గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన అద్భుతమైన కథ చిత్రం ద్వారా ఈమె ఆగస్టు 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. """/" / ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవ్వడమే కాకుండా సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను కూడా పెంచాయి.

ఇక ఈ సినిమా 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో నిహారిక వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈమెకు ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది.యాంకర్ నిహారికను ప్రశ్నిస్తూ మీరు కనుక ఫ్యూచర్లో నటించాలి అనుకుంటే ఈ ముగ్గురు హీరోలలో ఎవరితో నటిస్తారు ఎవరంటే మీకు ఇష్టం అనే ప్రశ్న వేశారు.

"""/" / ఇక యాంకర్ ముగ్గురు టాలీవుడ్ హీరోల గురించి ప్రస్తావిస్తూ ఎన్టీఆర్( NTR ) మహేష్ బాబు( Mahesh Babu ) ప్రభాస్( Prabhas ) ఈ ముగ్గురిలో ఎవరంటే ఇష్టం ఎవరితో సినిమా చేస్తారని అడిగారు.

ఈ ప్రశ్నకు నిహారిక ఏమాత్రం ఆలోచించకుండా తనకు ప్రభాస్ తో సినిమా చేయాలని ఉంది అంటూ తన మనసులో కోరికను బయటపెట్టారు.

ఇలా పెళ్లయిన హీరోలను కాకుండా పెళ్లికాని హీరోతోనే సినిమా చేయాలని ఉంది అంటూ ఈమె చెప్పడంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి.

అయితే నిహారిక ఇప్పటికే హీరోయిన్ గా మూడు సినిమాలలో నటించారు కానీ ఆ సినిమాలు అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో ఈమె పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లారు.

ఇక తన వైవాహిక జీవితం ఎక్కువ కాలం కొనసాగ లేకపోవడంతో విడాకులు తర్వాత ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టారు.

దేశంలోనే తొలిసారి.. తల్లిదండ్రులు కాబోతున్న ట్రాన్స్ జెండర్ జంట