ఆ హీరో అయితే ఓకే… పెళ్ళికాని హీరో పై మనసులో కోరిక బయటపెట్టిన మెగా డాటర్!
TeluguStop.com
నిహారిక కొణిదెల( Niharika Konidela ) ప్రస్తుతం తన మొదటి సినిమా కమిటీ కుర్రాళ్ళు( Committee Kurrollu ) సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు.
నిహారిక మొదటిసారి నిర్మాతగా మారి ఈ చిత్రాన్ని నిర్మించారు.ఇప్పటికే పలు వెబ్ సిరీస్లను నిర్మించిన నిహారికకు ఇదే మొదటి సినిమా కావటం విశేషం.
గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన అద్భుతమైన కథ చిత్రం ద్వారా ఈమె ఆగస్టు 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. """/" /
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవ్వడమే కాకుండా సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను కూడా పెంచాయి.
ఇక ఈ సినిమా 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో నిహారిక వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.
ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈమెకు ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది.యాంకర్ నిహారికను ప్రశ్నిస్తూ మీరు కనుక ఫ్యూచర్లో నటించాలి అనుకుంటే ఈ ముగ్గురు హీరోలలో ఎవరితో నటిస్తారు ఎవరంటే మీకు ఇష్టం అనే ప్రశ్న వేశారు.
"""/" /
ఇక యాంకర్ ముగ్గురు టాలీవుడ్ హీరోల గురించి ప్రస్తావిస్తూ ఎన్టీఆర్( NTR ) మహేష్ బాబు( Mahesh Babu ) ప్రభాస్( Prabhas ) ఈ ముగ్గురిలో ఎవరంటే ఇష్టం ఎవరితో సినిమా చేస్తారని అడిగారు.
ఈ ప్రశ్నకు నిహారిక ఏమాత్రం ఆలోచించకుండా తనకు ప్రభాస్ తో సినిమా చేయాలని ఉంది అంటూ తన మనసులో కోరికను బయటపెట్టారు.
ఇలా పెళ్లయిన హీరోలను కాకుండా పెళ్లికాని హీరోతోనే సినిమా చేయాలని ఉంది అంటూ ఈమె చెప్పడంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి.
అయితే నిహారిక ఇప్పటికే హీరోయిన్ గా మూడు సినిమాలలో నటించారు కానీ ఆ సినిమాలు అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో ఈమె పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లారు.
ఇక తన వైవాహిక జీవితం ఎక్కువ కాలం కొనసాగ లేకపోవడంతో విడాకులు తర్వాత ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టారు.
భారతీయుల రక్తంతో తడిసిన ఉక్రెయిన్.. రష్యా తరపున పోరాడుతూ 12 మంది ఇండియన్స్ దుర్మరణం!