నిహారిక ఇండస్ట్రీలోకి రాకముందు ఏం జాబ్ చేసేది.. ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

కమిటీ కుర్రోళ్ళు ( Commite Kurollu ) సినిమా ద్వారా నిర్మాతగా మంచి సక్సెస్ అందుకున్నారు నటి నిహారిక( Niharika ) మెగా డాటర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె కెరియర్ మొదట్లో యాంకర్ గా బుల్లితెర కార్యక్రమం పై సందడి చేశారు.

ఇలా బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తున్న నిహారిక అనంతరం ఒక మనసు సినిమా ద్వారా హీరోయిన్గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఇలా మెగా ఆడపడుచు హీరోయిన్గా ప్రేక్షకుల ముందుకు రావడానికి మెగా అభిమానులు జీర్ణించుకోలేకపోయారు.

దీంతో ఈమె నటించిన మూడు సినిమాలను కూడా పెద్దగా సక్సెస్ చేయలేదు. """/" / ఇలా నిహారిక నటిగా సక్సెస్ కాకపోవడంతో పెళ్లి చేసుకోవడం వైవాహిక బంధం నుంచి బయటకు వచ్చి తిరిగి నటిగా నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగడం జరుగుతుంది.

ఇక ఈమె నిర్మాత నిర్మించిన మొదటి సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.

ఈ క్రమంలోనే ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఈమె వరస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా నిహారిక ఎన్నో విషయాలను వెల్లడించారు.అయితే ఈమె ఇండస్ట్రీలోకి రాకముందు చేసిన జాబ్ తన మొదటి సంపాదన గురించి వెల్లడించారు.

"""/" / తాను యాంకర్ గా ఇండస్ట్రీలోకి రాకముందు హైదరాబాదులోనే ఒక కేఫ్ ( Cafe ) లో పనిచేశానని తెలిపారు అక్కడ పనిచేసినందుకుగాను తనకు వారానికి వెయ్యి రూపాయల జీతం ఇచ్చేవారని ఈమె తన మొదటి ఉద్యోగం అలాగే సంపాదన గురించి వెల్లడించారు.

ఇక నాన్న నన్ను ఎక్కువగా ఎక్కడికి పంపించేవారు కాదు అందుకే తన స్టడీస్ అన్ని కూడా హైదరాబాద్ లోనే పూర్తి అయ్యాయని ఇక తన జాబ్ కూడా మొదట హైదరాబాద్ లోనే చేశానని నిహారిక ఈ సందర్భంగా వెల్లడించారు.

దేవర మూవీ రెమ్యునరేషన్ల లెక్కలు మీకు తెలుసా.. ఎవరెవరు ఎంత తీసుకున్నారంటే?