ఆ విషయంలో ఉపాసన టాప్.. బాబాయ్ చాలా లీస్ట్: నిహారిక
TeluguStop.com
నిహారిక( Niharika ) ప్రస్తుతం కమిటీ కుర్రాళ్ళు( Committee Kurrollu ) సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో ఉన్నారు.
ఈమె నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ కావడంతో ఈమె ఎంతో సంతోషంలో ఉన్నారు.
ఇక ఈ సినిమా విడుదలైనప్పటికీ నిహారిక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మెగా కుటుంబం గురించి చేసిన వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ముఖ్యంగా తన బాబాయ్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) అలాగే తన అన్నయ్య చరణ్ గురించి క్లీన్ కారా( Klin Kaara ) గురించి నిహారిక చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
"""/" /
ఇక మెగా ఫ్యామిలీ మొత్తం ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు.
ఈ క్రమంలోనే తమ ఫ్యామిలీకి సంబంధించిన విషయాలతో పాటు తమ సినిమా విషయాలను కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
అయితే తాజగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారికకు సోషల్ మీడియా యాక్టివ్ నెస్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.
"""/" /
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉన్నవారిలో టాప్ ప్లేస్ లో ఉపాసన( Upasana ) వదిన ఉంటుందని తెలిపారు.
ఆమె ఏ విషయం అయినా వెంటనే సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు.
ఇక వదిన తర్వాత నేను నా తర్వాత సాయి ధరమ్ తేజ్ బావ ఉంటారని నిహారిక వెల్లడించారు.
ఇకపోతే పెదనాన్న ఏదైనా ట్రిప్ కి వెళ్ళినా వెంటనే అప్డేట్స్ అన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారని నిహారిక వెల్లడించారు.
ఇక అందరికన్నా తక్కువ చరణ్ అన్న సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు.
ఈయన ఏదైనా ఇంపార్టెంట్ విషయాలకు మాత్రమే స్పందిస్తూ ఉంటారు.ఇక సోషల్ మీడియాలో చాలా వీక్ అంటే పవన్ కళ్యాణ్ బాబాయి అని నిహారిక వెల్లడించారు.
బాబాయ్ సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉంటారని ఈ సందర్భంగా నిహారిక తన ఫ్యామిలీ గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
యూఎస్ కాంగ్రెస్‌లో ఆరుగురు భారత సంతతి నేతల ప్రమాణ స్వీకారం!!