ఏపీలో నైట్ కర్ఫ్యూ యధాతథం..!!

తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం జగన్ కరోనా సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న వ్యాక్సినేషన్ అదే రీతిలో నమోదవుతున్న కేసులు కరోనా నియంత్రణపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న నైట్ కర్ఫ్యూ యథాతథంగా కొనసాగించాలని డిసైడ్ అయ్యారు.

రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగించాలని పేర్కొన్నారు.

ఇదే క్రమంలో మరి కొంత కాలం వేచి ఉండి అప్పుడు కర్ఫ్యూ ఎత్తివేతకు రెడీ అవ్వాలని అప్పటి పరిస్థితుల బట్టి ఆలోచిద్దామని అధికారులతో సీఎం జగన్ అన్నట్లూ టాక్.

అంత మాత్రమే కాక త్వరలో వినాయక చవితి పండుగ వస్తున్న నేపథ్యంలో జనాలు గుమిగుడకుండ.

అధికారులు చర్యలు తీసుకోవాలని, పండుగ ఇంటికే పరిమితం అయ్యేలా చూడాలని సీఎం జగన్ ఆదేశించారు.

అదే రీతిలో నిమజ్జనాలు మరియు ఊరేగింపులు అనుమతించకుండా.ఎక్కడికక్కడ కరోనా నిబంధనలు పాటించెలా.

అధికారులు అలర్ట్ అవ్వాలని తెలిపారు.ఇంకా మహామారి ప్రభావం పోలేదని రానున్న పండుగల సీజన్ లో చాలా జాగ్రత్తగా ఉండాలని.

మరోసారి కేసులు పెరగకుండా అన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని.అధికారులకు జగన్ దిశానిర్దేశం చేశారు.

బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ బంధం గురించి నారా లోకేశ్ అలా అన్నారా.. ఏమైందంటే?