బ్రేకింగ్ : ఏపీలో నైట్ కర్ఫ్యూ స్టార్ట్..వ్యాక్సిన్ ఫ్రీ..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదివేలకు పైగా కొత్త పాజిటివ్ కేసులు బయటపడుతూ ఉండటంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది.

ఈ క్రమంలో సీఎం జగన్ కరోనా వ్యాప్తి కట్టడి పై సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి మంత్రి వర్గ ఉప సంఘం మరియు ఉన్నత అధికారులతో జగన్ భేటీ అయ్యారు.

ఈ తరుణంలో రాష్ట్రంలో బెడ్లు మరియు ఆక్సిజన్ కొరత అదేవిధంగా టెన్త్ మరియు ఇంటర్ పరీక్షలు నిర్వాహణ విషయంలో చర్చించడం జరిగింది.

ఈ క్రమంలో రాష్ట్రంలో ఇప్పటికే సాయంత్రం 6 గంటల కల్లా అన్ని దుకాణాలు మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా రేపటి నుండి రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేయటానికి జగన్ ప్రభుత్వం.

రెడీ అయింది.రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ ఏపీలో అమలు కానున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు.

అదేవిధంగా రాష్ట్రంలో 18 నుండి 45 సంవత్సరాల వయసు పైబడిన వాళ్ళకి వ్యాక్సిన్ ప్రభుత్వమే ఉచితంగా అందిస్తుందని మంత్రి పేర్కొన్నారు.

తప్పనిసరిగా బయటకు వచ్చే ప్రతి ఒక్కరు మాస్కు ధరించాలి అని.సోషల్ డిస్టెన్స్ పాటించాలని మంత్రి రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

 .

చిరంజీవి స్టాలిన్ పోస్టర్ తో అద్భుతం సృష్టించిన ప్రశాంత్ వర్మ?