తొలిసారి కలవగానే ఆ డైరెక్టర్ ముఖం కడుక్కో అన్నారు.. నిధి షాకింగ్ కామెంట్స్!

అందం, అభినయం ఉన్నా అదృష్టం లేని హీరోయిన్ గా నిధి అగర్వాల్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది.

హరిహర వీరమల్లు సినిమాతో నిధి అగర్వాల్ పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపును సంపాదించుకుంటారని ఫ్యాన్స్ భావించగా ఈ సినిమా విడుదల కావడానికి మరో ఏడాది సమయం పట్టే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.

నిధి అగర్వాల్ హరిహర వీరమల్లుతో భారీ సక్సెస్ ను అందుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

నిధి అగర్వాల్ తెలుగుతో పాటు ఇతర భాషల్లోని సినిమాలలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇస్మార్ట్ శంకర్ మినహా కెరీర్ లో మరే హిట్ లేని నిధి అగర్వాల్ కలగ తలైవన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

రెడ్ జాయింట్ మూవీస్ నిర్మాణంలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు కోలీవుడ్ డైరెక్టర్ మగిళ్ తిరుమేణి దర్శకత్వం వహించడం గమనార్హం.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిధి అగర్వాల్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ఈ మూవీ డైరెక్టర్ మగిళ్ తిరుమేణిని తొలిసారి కలిసిన సమయంలో ఆయన ముఖం కడుక్కొని రావాలని సూచనలు చేశారని ఆమె తెలిపారు.

తాను ముఖం కడుక్కొని వచ్చిన తర్వాత ఫేసియల్ ఎక్స్ ప్రెషన్స్ కొరకు ఫోటో షూట్ చేశారని నిధి అగర్వాల్ కామెంట్లు చేశారు.

కలగ తలైవన్ మూవీ కోసం తాను మేకప్ లేకుండా నిధి అగర్వాల్ వెల్లడించారు.

ఈ సినిమాలో ఉదయనిధి స్టాలిన్ హీరోగా నటించారు. """/"/ తమిళ సినిమాలలో ఆఫర్లు వస్తుండటంతో తమిళం నేర్చుకుంటున్నానని ఆమె తెలిపారు.

ఉదయనిధి స్టాలిన్ నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నానని నిధి అన్నారు.ఆయన పర్సనల్ లైఫ్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మూవీ షూట్ సమయంలో ఆ ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారని నిధి అగర్వాల్ వెల్లడించారు.

నన్ను కెలికినప్పటి నుంచి ఇండస్ట్రీలో ఇబ్బందులు.. వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు!