ఇన్ స్టాలో 13 మిలియన్ ఫాలోవర్స్.. ఫుల్ జోష్ లో నిధి..!

ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ తెలుగు, తమిళ సినిమాలతో దూసుకెళ్తుంది.ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న హరి హర వీరమల్లుతో పాటుగా గల్లా అశోక్ హీరో సినిమాలో ఆమె నటిస్తుంది.

మరో రెండు తెలుగు క్రేజీ ప్రాజెక్టుల్లో కూడా నిధి అగర్వాల్ డిస్కషన్స్ లో ఉందని తెలుస్తుంది.

ఇక ఇదిలాఉంటే అమ్మడు తమిళంలో కూడా వరుస సినిమాలతో దూసుకెళ్తుంది.అక్కడ ఇక్కడ క్రేజ్ తో అమ్మడు ఇన్ స్టాగ్రాం లో 13 మిలియన్ ఫాలోవర్స్ ను క్రాస్ చేసింది.

ఇన్ స్టాగ్రాం లో 13 మిలియన్ క్రాస్ చేసిన క్రేజీ హీరోయిన్స్ లిస్ట్ లో నిధి అగర్వాల్ కూడా చేరింది.

ఇన్ స్టాగ్రాం లో 13 మిలియన్ ఫాలోవర్స్ వచ్చిన సందర్భంగా నిధి అగర్వాల్ ఫుల్ జోష్ లో ఉంది.

అందుకే ఓ స్పెషల్ ఫోటో షూట్ తో ఫ్యాన్స్ ను అలరిస్తుంది.ఎప్పుడూ తన హాట్ ఫోటో షూట్స్ తో ఆడియెన్స్ ను అలరించే నిధి లేటెస్ట్ గా మరింత రెచ్చిపోయిందని చెప్పొచ్చు.

తన అందంతో ఆడియెన్స్ ను కట్టి పడేస్తున్న నిధి అగర్వాల్ తెలుగులో టాప్ పొజిషన్ టార్గెట్ పెట్టినట్టు అనిపిస్తుంది.

అందుకే ఇక్కడ సెలెక్టెడ్ సినిమాలు చేస్తుంది.తమిళంలో ఆల్రెడీ అమ్మడు వరుస స్టార్ అవకాశాలతో సత్తా చాటుతుంది.

కోలీవుడ్ లో నిధి అగర్వాల్ కు గుడి కట్టే ఫ్యాన్స్ ఉన్నారంటే అమ్మడికి అక్కడ ఎంత క్రేజ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు.

Smartphone Photography Accessories : ఫోన్ లో మెరుగైన ఫోటోలను తీసేందుకు బెస్ట్ స్మార్ట్ ఫోన్ ఫోటోగ్రఫీ యాక్ససరీస్ లు ఇవే..!