శివయ్య భక్తిలో టాలీవుడ్ హీరోయిన్లు.. శివుడి నామాలతో కనిపించిన హీరోయిన్లు వీళ్లే!
TeluguStop.com
తాజాగా మహాశివరాత్రి పండుగ ( Mahashivratri Festival )సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలో శివాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.
మాఘమాసం ఆఖరి రోజు అందులో మహాశివరాత్రి కావడంతో భక్తులు శివాలయాలకు అధిక సంఖ్యలో పోటెత్తారు.
శివాలయాలు అన్నీ కూడా శివనామస్మరణతో మారుమోగిపోయాయి.అయితే ఈ మహాశివరాత్రి వేడుకలను సామాన్యుల నుంచి సెలబ్రిటీల( Celebrities ) వరకు ప్రతి ఒక్కరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారు.
అందులో భాగంగానే టాలీవుడ్ సెలబ్రిటీలు చాలామంది మహాశివరాత్రి వేడుకలను జరుపుకొని అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
"""/" /
ప్రస్తుతం ఆ ఫోటోస్ అందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇంతకీ ఆ హీరోయిన్లు ఎవరు ఏంటి అన్న వివరాల్లోకి వెళితే.మహాశివరాత్రి పండుగ సందర్భంగా నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల ( Nidhi Aggarwal, Ananya Nagalla )లాంటి హీరోయిన్స్ దేవాలయాలకు వెళ్లారు.
సింగర్ శ్రేయా ఘోషల్( Singer Shreya Ghoshal ) శివుడి బొమ్మతో ఉన్న చీరతో కనిపించింది.
మరికొందరు బ్యూటీస్ ఎప్పటిలానే కాస్త గ్లామరస్ పోస్టులు పెట్టారు.హీరోయిన్ శ్రేయ ఘోషల్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో మహాశివరాత్రి పండుగ సందర్భంగా శివయ్య ఉన్న బట్టలను ధరించిన ఈ ముద్దుగుమ్మ చేతులకు విభూదితో మూడు నామాలను గీసుకొని, అందంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
అలాగే అనన్య నాగళ్ళ పద్ధతిగా చీర కట్టుకొని అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
"""/" /
అనన్య మహాశివరాత్రి పండుగ సందర్భంగా శ్రీశైలంలో దర్శించింది.అలాగే ప్రేమ కావాలి హీరోయిన్ ఇషా చావ్లా ( Isha Chawla )తాజాగా పద్ధతిగా చీర కట్టుకొని నిండుగా అలంకరించుకొని మరి మహాశివరాత్రి వేడుకలను జరుపుకుంది.
చాలా చక్కగా పట్టు చీరలో ఒంటి నిండా నగలతో మెరిసిపోతోంది ఇషా చావ్లా.
అలాగే సుస్మితాసేన్ ( Susmithasen )కూడా మహాశివరాత్రి పండుగ సందర్భంగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది.
వీటితోపాటు ఇంకా చాలామంది హీరోయిన్లు కూడా ఫోటోలు షేర్ చేశారు.ప్రణీత పట్టు లంగా వోణీలో మెరిసింది.
చక్కగా అందంగా అలంకరించుకొని పద్ధతిగా కనిపిస్తూనే అందాలతో సెగలు పుట్టిస్తోంది.