మావోయిస్ట్ ఆర్కే భార్య శిరీష అరెస్ట్ పై ఎన్ఐఏ ప్రకటన

మావోయిస్ట్ ఆర్కే భార్య శిరీషా అరెస్టుపై ఎన్ఐఏ కీలక ప్రకటన చేసింది.ఆర్కే డైరీ ఆధారంగా శిరీషను అరెస్ట్ చేసినట్లు ఎన్ఐఏ అధికారులు తెలిపారు.

ఆర్కే భార్య శిరీషాతో పాటు దుడ్డు ప్రభాకర్ ను కూడా అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

దుడ్డు ప్రభాకర్, శిరీష మావోయిస్టుల కోసం పని చేస్తున్నారన్నారు.మావోయిస్టుల నుంచి వీరికి పెద్ద ఎత్తున నిధులు అందుతున్నాయని చెప్పారు.

2019 తిరియా ఎన్ కౌంటర్ లో ఇద్దరు పాల్గొన్నారన్న ఎన్ఐఏ మావోల రిక్రూట్ మెంట్ కోసం పని చేస్తున్నారని పేర్కొన్నారు.

అంతేకాకుండా మావో వారోత్సవాల సందర్భంగా భారీ కుట్రకు ప్లాన్ చేశారని తెలిపింది.

వామ్మో.. ఇంట్లో ఎటు చూసినా నోట్ల కట్టలే! (వీడియో)