కెనడాలో ఖలిస్తాన్ ఉగ్రవాదితో సంబంధాలు .. పంజాబ్‌లో ఎన్ఐఏ సోదాలు, ఒకరి అరెస్ట్

కెనడాలో ఖలిస్తాన్ ఉగ్రవాదితో సంబంధాలు పంజాబ్‌లో ఎన్ఐఏ సోదాలు, ఒకరి అరెస్ట్

కెనడా కేంద్రంగా పనిచేస్తున్న ఖలిస్తానీ ఉగ్రవాదితో సంబంధం ఉన్న వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) పంజాబ్‌లో అరెస్ట్ చేసింది.

కెనడాలో ఖలిస్తాన్ ఉగ్రవాదితో సంబంధాలు పంజాబ్‌లో ఎన్ఐఏ సోదాలు, ఒకరి అరెస్ట్

గురువారం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎన్ఐఏ( NIA ) బృందాలు సోదాలు చేశాయి.

కెనడాలో ఖలిస్తాన్ ఉగ్రవాదితో సంబంధాలు పంజాబ్‌లో ఎన్ఐఏ సోదాలు, ఒకరి అరెస్ట్

ఈ క్రమంలోనే సదరు వ్యక్తిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు.పంజాబ్‌లోని( Punjab ) ఫిరోజ్‌పూర్ జిల్లాకు చెందిన జస్‌ప్రీత్ సింగ్‌ను( Jaspreet Singh ) అదుపులోకి తీసుకున్నట్లు దర్యాప్తు సంస్థ ప్రకటించింది.

ఉగ్రవాది లఖ్‌బీర్ సింగ్‌ లాండాతో( Lakhbir Singh Landa ) జస్‌ప్రీత్‌కు సంబంధాలు ఉన్నట్లుగా ఎన్ఐఏ అనుమానం వ్యక్తం చేస్తోంది.

అతని వద్ద నుంచి పాయింట్ 32 బోర్ రివాల్వర్, 69 కాట్రిడ్జ్‌లు, 100 గ్రాముల హెరాయిన్, 100 గ్రాముల నల్లమందు, రూ.

2,20,500 నగదు, పలు డిజిటల్ పరికరాలను అధికారులు సీజ్ చేశారు.గతేడాది జూలై 10న ఎన్ఐఏ నమోదు చేసిన కేసులో.

భారత్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలలో లాండా ప్రమేయం ఉన్నట్లుగా పేర్కొంది. """/" / దేశంలోని నిషేధిత ఉగ్రవాద సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (బీకేఐ) సానుభూతిపరులు, స్లీపర్ సెల్స్ టార్గెట్‌గా ఎన్ఐఏ ఈ సోదాలు నిర్వహించింది.

ఈ సందర్భంగా 10 మంది అనుమానితులను మధ్యప్రదేశ్, గుజరాత్, పంజాబ్‌లలో అరెస్ట్ చేసింది.

ఉగ్రవాద కుట్రలతో పాటు ఈ ఉగ్రవాదులు అంతర్జాతీయ సరిహద్దులు , అంతర్రాష్ట్ర సరిహద్దుల గుండా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్మగ్లింగ్ చేసినట్లు ఎన్ఐఏ ఆధారాలు సేకరించింది.

ఉగ్రవాద చర్యల కోసం వివిధ మార్గాల ద్వారా తమ సహచరులకు నిధులను బదిలీ చేయడంలోనూ వీరి ప్రమేయం ఉన్నట్లుగా తెలిపింది.

"""/" / కాగా.పంజాబ్, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఉగ్రదాడులకు పాల్పడేందుకు కుట్రపన్నిన కేసులో కెనడాకు ( Canada ) చెందిన ఖలిస్తానీ వేర్పాటువాది, ఉగ్రవాది అర్ష్‌దీప్ సింగ్( Arshdeep Singh ) అతని ముగ్గురు అనుచరులపై ఎన్ఐఏ గత నెలలో ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

పంజాబ్, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాద దాడులకు పాల్పడేందుకు అర్ష్‌దీప్ సింగ్ అలియాస్ అర్ష్ దాలా నిర్వహిస్తున్న స్లీపర్ సెల్స్‌ను ధ్వంసం చేసేందుకు ఎన్ఐఏ చేస్తున్న ప్రయత్నాల్లో ఈ చర్య పెద్ద ముందడుగుగా చెబుతున్నారు.

కెనడాకు చెందిన అర్ష్‌దీప్ సింగ్ అతని భారతీయ ఏజెంట్లు హర్జీత్ సింగ్ అలియాస్ హ్యారీ మౌర్, రవీందర్ సింగ్ అలియాస్ రాజ్‌విందర్ సింగ్ అలియాస్ హ్యారీ రాజ్‌పురా, రాజీవ్ కుమార్ అలియాస్ షీలాపై న్యూఢిల్లీలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఛార్జ్‌షీట్ దాఖలు చేసినట్లుగా యాంటీ టెర్రర్ ఏజెన్సీ ఓ ప్రకటనలో తెలిపింది.

కెనడాలో ఉంటున్న ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్‌ ఉగ్రవాది అర్ష్‌దీప్ ఆదేశాల మేరకు ఈ ముగ్గురు భారతదేశంలో ఉగ్రవాద-గ్యాంగ్‌స్టర్ సిండికేట్‌ను నడుపుతున్నారు.

పాకిస్థాన్‌లో దారుణం: బిచ్చగత్తెపై పోలీసు రేప్ అటెంప్ట్.. వీడియో వైరల్..