చిన్న పొరపాటు వల్ల రూ.7.6 కోట్లు పోగొట్టుకున్న ఎన్‌ఎఫ్‌టీ కలెక్టర్... ఎలా అంటే?
TeluguStop.com
అదృష్టం బాగోలేకపోతే మనకు దక్కాల్సిన సంపద కూడా మన చేతుల్లో నుంచి చేజారిపోతుంది.
అదే విషయాన్ని తాజాగా ఒక ఒక సంఘటన నిరూపిస్తోంది.ఒక ఎన్‌ఎఫ్‌టీ కలెక్టర్ 1 మిలియన్ డాలర్ల (రూ.
7.6 కోట్లు) విలువైన డ్రాయింగ్‌ను రూ.
100 కంటే తక్కువ ధరకే అమ్ముకున్నాడు.అయితే ఒక పొరపాటు వల్ల అతను దీన్ని తక్కువ ధరకే సేల్ చేశాడు.
ఈ కలెక్టర్ ఎన్‌ఎఫ్‌టీ టెక్నాలజీకి కొత్త కాదు.కనీసం ఏడాది పాటు వ్యాపారం చేసిన అనుభవం ఉన్నా, చిన్న తప్పు చేసి పెద్ద మొత్తంలో డబ్బు పోగొట్టుకున్నాడు.
ఇతడు అమ్ముకున్న నాన్ ఫంగిబుల్ టోకెన్ (ఎన్‌ఎఫ్‌టీ) అనేది బూడిద రంగు షేడ్స్‌లో ఉన్న ఓ రాక్ ఫొటో.
అయితే దీనిని సదరు వ్యక్తి చాలా డబ్బులు వెచ్చించి కొనుగోలు చేశాడు.అయితే మళ్లీ దాన్ని క్రిప్టో కరెన్సీలో రీసేల్ చేయాలనుకుంటున్న సమయంలోనే తప్పు చేశాడు.
ట్విట్టర్‌లో @dino_dealer అనే అకౌంట్ ద్వారా ఈ విషయాలను అతడు వెల్లడించాడు."నేను 444 ఈథర్ (eth) బదులుగా 444 Wei లలో డ్రాయింగ్ ని అమ్మకానికి పెట్టాను.
దీంతో ఎవరో Wei క్రిప్టో కరెన్సీ చెల్లించి దానిని కొనేశారు.Wei కరెన్సీ విలువ చాలా తక్కువ.
ఈథర్ విలువ చాలా ఎక్కువ.అందుకే నేను 1.
2 మిలియన్ల డాలర్లను సెకన్లలో కోల్పోయాను" అని సదరు వ్యక్తి తన ఆవేదనను వెళ్లగక్కాడు.
పొరపాటు ఫలితంగా, NFT 444 Weiకి విక్రయించబడింది.ఇది దాదాపు ఏమీ విలువ లేని 0.
0012 డాలర్లకు సమానం.ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు అయ్యో పాపం అని సానుభూతి చూపిస్తున్నారు.
ఎన్‌ఎఫ్‌టీలు సేల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.
చుండ్రు ఎంత తీవ్రంగా ఉన్నా ఈ రెమెడీతో శాశ్వతంగా వదిలించుకోండి!