వచ్చే ఏడాది పతనమే.. టైమ్ ట్రావెలర్ ఏం చెప్పాడంటే
TeluguStop.com
ఈ ప్రపంచంలో ఎప్పుడూ ఏదోక వింత జరుగుతూనే ఉంటుంది.టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ గురించి అందరిలో ఆసక్తిని రేపుతోంది.
30 ఏళ్ల క్రితం బాలయ్య నటించిన ఆదిత్య 369 అనే సినిమాలో టైమ్ ట్రావెల్ గురించి తెలియజేశారు.
శాస్త్రవేత్తలు కూడా ఆ సినిమాతో కొంత స్ఫూర్తిని పొందారు.వెనకటి జీవితం, అలాగే భవిష్యత్ జీవితాన్ని టైమ్ ట్రావెలర్ తెలియజేస్తుంది.
మరి అలాంటి అంశాన్ని ఓ వ్యక్తి మరోసారి తెరమీదకు తెచ్చారు.ఓ టైమ్ ట్రావెలర్ భూమి మీదకు వచ్చానని, 2671వ ఏడాది నుంచి అతను భూమిపైకి వచ్చినట్లు చెప్పుకొస్తున్నాడు.
కొందరికి ఆయన మాటలు ఆసక్తిని కలిగిస్తుంటే మరికొందరికీ మాత్రం భయాన్ని కలిగిస్తున్నాయి. """/"/
ఈ మధ్యకాలంలో ఓ టైమ్ ట్రావెలర్ ఓ వీడియోను టిక్ టాక్ లో పోస్టు చేశాడు.
ఆ టైమ్ ట్రావెలర్ పేరు ఎనో అలారిక్ అని, అతను 2671వ సంవత్సరం నుంచి ఇప్పుడు జరుగుతున్న కాలానికి వచ్చానని చెబుతున్నాడు.
అంతేకాదు ఈ నెల డిసెంబరు నుంచి 2023 మే నెల వరకూ భూమిపై కొన్ని ఘటనలు జరుగుతాయంటూ హెచ్చరికలు కూడా చేశాడు.
తన వీడియో ద్వారా కొన్ని ఆసక్తికర విషయాలను ప్రపంచానికి తెలియజేశాడు.భూమిపై ఓ భారీ సునామీ రానుందని, ఆ సునామీకి అమెరికా సైతం కొట్టుకుపోతుందని చెప్పాడు.
అతడు పోస్టు చేసిన ఆ వీడియో ఇప్పుడు చర్చనీయాంశమైంది.దీంతో అతని గురించి నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు.
ఎనో అలారిక్ కు టిక్ టాక్ లో 26 మంది వ్యూయర్స్ ఎక్కువగా ఫాలో అవుతుంటారు.
ఆయన ఎప్పుడూ భవిష్యత్ విషయాల గురించే చర్చిస్తుంటారు.ఈ వ్యక్తే గతంలో కూడా భూమిపై గ్రహాంతర వాసులు వస్తారనే విషయాన్ని ముందుగానే తెలియజేశాడు.
అలాగే డిసెంబరు 12న పుష్కరకాలం కిందట మిస్ అయిన విమానం మళ్లీ తిరిగి ల్యాండ్ అవుతుందని చెప్పాడు.
ఆయనిచ్చిన గడువుకు ఇంకో వారమే ఉంది.
మంచి నిద్రకు నువ్వుల నూనె.. ఎలా ఉపయోగించాలో తెలుసా?