17 వ లోక్ సభ స్పీకర్ గా ఎంపీ ఓం బిర్లా ఎన్నిక

17 వ లోక్ సభ స్పీకర్ గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఎన్నికైనట్లు తెలుస్తుంది.

గత కొద్దీ రోజులుగా లోక్ సభ స్పీకర్ అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తారు అంటూ వచ్చిన వార్తలకు తెరదించుతూ ఓం బిర్లా పేరును ఖరారు చేసింది.

ఓం బిర్లా ఎన్నికను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని యూపీఏ, ఇతర ప్రతిపక్ష పార్టీలూ సపోర్ట్ చేయడం తో ఎలాంటి పోటీ లేకుండానే బిర్లా ఎన్నిక ఏకగ్రీవం అయిపొయింది.

అయితే లోక్ సభ స్పీకర్ పదవి ఒక రాజస్థాన్ వాసికి దక్కడం మాత్రం ఇదే తొలిసారి.

బిర్లా రాజస్థాన్లోని కోటా లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి రెండోసారి ఎంపీ గా ఎన్నికయ్యారు.

స్పీకర్ క్యాండేట్గా బిర్లా పేరును ప్రపోజ్ చేస్తూ బీజేపీ మంగళవారం లోక్సభ సెక్రటేరియట్కు నోటీసు ఇవ్వగా దానికి యూపీఏ,వైసీపీ,బీజేడీ పార్టీలు కూడా మద్దతు తెలపడం తో ఎలాంటి నామినేషన్,పోటీ ప్రక్రియ లేకుండానే బిర్లా ఎన్నిక ఏకగ్రీవం అయిపొయింది.

"""/"/ కొత్త స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టబోతున్న ఓం బిర్లా ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది.

స్వీట్లు తినిపించుకుంటూ కుటుంబీకులు సంతోషాన్ని పంచుకున్నారు.పేరు ప్రకటించిన కొద్దిసేపటికే బిర్లా.

మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ను కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు.ప్రతి సారి కూడా ఏంతో అనుభవం ఉన్న నేతలను ఈ స్పీకర్ స్థానానికి ఎంపిక చేయడం అనేది జరుగుతుంది.

అయితే ఈ సారి మాత్రం కేవలం రెండువ సారి ఎంపీ గా ఎన్నికైన బిర్లాను ఈ పోస్ట్ కు ఎన్నుకోవడం గమనార్హం.

ఎంతో మంది సీనియర్లు ఉన్నా, సెకండ్ టైమ్ ఎంపీ అయిన ఓం బిర్లాకే అవకాశం కల్పించాలన్న నిర్ణయం పూర్తిగా ప్రధాని నరేంద్ర మోడీ, పార్టీ చీఫ్ అమిత్ షాలదేనని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.

అరటి పండు ఆరోగ్యానికే కాదు జుట్టు రాలడాన్ని అరికడుతుంది.. ఎలా వాడాలంటే?