వరుడి నిర్వాకం,పెళ్లి చేసుకొన్న నాలుగు రోజులకే….

ఎంతో సంతోషంగా పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన నవ వధువు కి ఆ ఆనందం ఏమాత్రం మిగల్చకుండా కేవలం నాలుగు రోజులకే వరుడు ఇంటినుంచి పారిపోయాడు.

కోటి ఆశలతో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన ఆ యువతిని ఇంటిలోనే వదిలేసి పెళ్ళైన నాలుగు రోజులకే ఆ వరుడు ఇంటినుండి పారిపోయిన ఘటన కలకలం రేపింది.

ఈ ఘటన కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది.కర్నూలు జిల్లా కోవెలకుంట్ల పట్టణంలోని ఆర్టీసి బస్టాండ్ సమీపంలో నివాసం ఉంటున్న వీరాకుమార్ నాలుగు రోజుల క్రితం బంధువుల సమక్షంలో ఒక యువతిని వివాహం చేసుకున్నాడు.

అయితే వివాహం అయిన నాలుగు రోజులకే అమ్మయిని ఇంటిలోనే వదిలి పెట్టేసి సడన్ గా పారిపోయాడు.

దీనితో కాళ్ళ పారాణి కూడా ఆరకముందే ఆ యువతీ పోలిస్ స్టేషన్ మెట్లెక్కి అతడిపై కేసు నమోదు చేయాల్సిన పరిస్థితి ఎదురైంది.

అయితే హైదరాబాద్ లో వరుడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తుండగా, వేరే యువతితో ప్రేమ వ్యవహారం కారణంగానే ఇంట్లోంచి పారిపోయాడని యువతీ తరుపు బంధువులు ఆరోపిస్తున్నారు.

త‌మ కూతురు జీవితాన్ని న‌డిరోడ్డున ప‌డేశార‌ని వారు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.పెళ్లి చేసుకున్న నాలుగు రోజులకే ఇలా తమ బిడ్దను వదిలేసి పారిపోవడాన్ని వారంతా జీర్ణించుకోలేకపోతున్నారు.

అందుకే ఏమి చేయాలో పాలుపోక పోలీసులకు ఫిర్యాదు చేయడం తో కేసు నమోదు చేసిన కోవెలకుంట్ల పోలీసులు వీరాకుమార్ కోసం గాలిస్తున్నట్లు సమాచారం.

షాకింగ్ వీడియో: పట్టాలు దాటుతుండగా దూసుకొచ్చిన గూడ్స్ రైలు.. విద్యార్థిని నుజ్జునుజ్జు!