భర్త తో గొడవ పడి నవ వధువు ఏకంగా…

ప్రస్తుత కాలంలో కొందరికి ప్రతి చిన్న విషయానికి ఆత్మహత్య చేసుకోవడం అలవాటయింది.దీంతో తమ అనుకున్న వారి జీవితాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంటోంది.

తాజాగా ఓ నవ వధువు పెళ్లయి కొంత కాలం కూడా సంతోషంగా గడపకుండానే ఆత్మహత్య చేసుకొన్న ఘటన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే స్థానిక నగర పరిసర ప్రాంతంలో సంతోషి కుమారి అనే నవ వధువు తన భర్తతో కలిసి నివాసం ఉంటోంది.

అయితే ఈ మధ్య ఓ విషయంలో సంతోషి తన భర్తతో తగువు పడింది.

అయితే ఈ తగువులో ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో సంతోషి తీవ్ర మనస్తాపానికి గురైంది.

దీంతో క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది.ఇందులో భాగంగా తాను నివాసం ఉంటున్నటువంటి భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.

ఇది గమనించినటువంటి కొందరు స్థానికులు వెంటనే బాధితురాలిని చికిత్స నిమిత్తం దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది.

ఈ విషయం ఒక్కసారిగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలని భయాందోళనలకు గురి చేసింది.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

పెళ్లయి అత్తారింట్లో సంతోషంగా గడపాల్సిన కూతురు ఇలా అర్ధాంతరంగా ఆత్మహత్య చేసుకోవడంతో ఒక్కసారిగా మృతురాలి తల్లిదండ్రులు బోరున విలపించారు.

వైరల్ వీడియో: పిల్లలు చేసిన పనికి ఫిదా అవ్వాల్సిందే