తగ్గేదేలే అంటున్న అప్పుడే పుట్టిన బుడ్డోడు.. వీడియో వైరల్

అల్లు అర్జున్, రష్మిక మందన్న నటించిన పాన్ ఇండియా మూవీ పుష్ప.ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఈ మూవీలోని పాటలు, డైలాగులు ఓ రేంజ్​ లో పేలాయి.ఎంతలా అంటే ఈ పుష్ప ఫీవర్ ఒక టాలీవుడ్ కి మాత్రమే కాదు దేశ విదేశాల్లోనూ డైలాగులు చాలా ఫేమస్ అయ్యాయి.

ఇందులోని డ్యాన్స్ స్టెప్పులు కూడా తెగ వైరల్ అయ్యాయి.చాలా మంది పుష్ప డ్యాన్స్ స్టెప్పులు వేస్తూ రీల్స్ చేశారు.

ఈ రీల్స్ కూడా చాలా వైరల్ అయ్యాయి.అప్పుడే పుట్టిన పిల్లల నుంచి పండు ముసలివాళ్ల వరకు ప్రతి ఒక్కరూ పుష్ప స్టైల్స్ ను ప్రతి ఒక్కరూ ఫాలో అవుతున్నారు.

వారు కూడా ఆ స్టైల్స్​ ను అనుకరిస్తూ రీల్స్ చేస్తున్నారు.ఇక ఇంటర్నేషనల్ స్టార్స్ కూడా పుష్ప స్టైల్ రిపీట్ చేస్తున్నారు.

ఇలా పుష్ప స్టైల్ ను అనుకరిస్తున్న ఓ వ్యక్తి వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ఇంతకీ ఆ వ్యక్తి ఏం చేశాడా అని ఎదురు చూస్తున్నారా.ఆ వైరల్ వీడియోలో ఉన్న వ్యక్తి ఏదో పెద్ద వ్యక్తి అయితే పరవాలేదు.

కానీ ఆ వ్యక్తి అప్పుడే పుట్టిన వ్యక్తి కావడం విశేషం. అతడు కూడా అచ్చంగా పుష్ప మూవీలో అల్లు అర్జున్ మాదిరిగానే గడ్డం కింద చేతులు పెట్టి తగ్గేదేలే అంటూ అనుకరించాడు.

ఈ వీడియోను ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.అది వైరల్ గా మారింది.

పుష్ప ఫీవర్ అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా పాకిందని ఈ వీడియో చూస్తే ఇట్టే అర్థమవుతోంది.

ఈ వీడియోను ఇప్పటికే అనేక మంది షేర్ చేశారు.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోను వెంటనే చూసేయండి.

గుహలో నిజంగానే 188 ఏళ్ల వ్యక్తిని రక్షించారా.? నిజమెంత?