వాట్సాప్ లో సరికొత్తగా యూజర్ నేమ్ ఫీచర్.. యూజర్ల ప్రైవసీ, సేఫ్టీ పై మెటా దృష్టి..!

వాట్సప్( Whatsapp ) తన యూజర్ల ప్రైవసీ, సేఫ్టీ లపై దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తూనే ఉంది.

ఇప్పటివరకు చాలానే సేఫ్టీ ఫీచర్లను యూజర్లకు పరిచయం చేసింది.ఇప్పుడు సరికొత్తగా యూజర్ నేమ్ ఫీచర్( Username Feature ) ని పరిచయం చేస్తోంది.

ఈ ఫీచర్ ప్రత్యేకత ఏమిటో చూద్దాం.మన అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే సాధారణంగా వాట్సాప్ లో కమ్యూనికేట్ అయినప్పుడు అవతల వ్యక్తి ఫోన్ నెంబర్ సులభంగా తెలిసిపోతుంది.

దీంతో ప్రైవసీకి కాస్త భంగం కలిగినట్టే.అంతేకాకుండా వాట్స్అప్ నెంబర్లు గుర్తుపెట్టుకోవడం కూడా కష్టమే.

ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకే యూజర్ నేమ్ ఫీచర్ వచ్చేసింది. """/" / ఇకపై ఫోన్ నెంబర్ స్థానంలో యూజర్ నేమ్ ఉంటుంది.

దీంతో యూజర్లు తమ ప్రైవసీని కోల్పోకుండా ఉండవచ్చు.వాట్సప్ బీటా ఆండ్రాయిడ్( Beta Android ) 2.

23.11.

15 లో ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.వాట్సప్ ఓపెన్ చేశాక వాట్సాప్ సెట్టింగ్స్ లో ప్రొఫైల్ సెక్షన్ కి వెళ్ళాలి.

అక్కడ యూజర్ నేమ్ సెట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది.అంతేకాదు బంధువులు, స్నేహితులు గుర్తుంచుకునేలా యూజర్లు యూనిట్ యూజర్ నేమ్ కూడా సెట్ చేసుకోవచ్చు.

తమను కాంటాక్ట్ అయ్యే వారు ఫోన్ నెంబర్ ను తెలుసుకోకుండా యూజర్లు ఈ ఫీచర్ తో జాగ్రత్త పడొచ్చు.

"""/" / ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది.కాబట్టి ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది అని తెలియాలంటే ఇంకొన్ని రోజులు మాత్రమే ఆగాల్సి ఉంది.

యూజర్ నేమ్ తో చేసే సంభాషణలకు ఎండ్- టు- ఎండ్ ఎన్క్రిప్షన్ ఆఫర్ కూడా ఉంది.

ఈ ఫీచర్ త్వరలో బీటా టెస్టర్లకు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.ఆ తరువాత వాట్సప్ ఉపయోగించే ప్రతి ఒక్కరికి అందుబాటులోకి రానుంది.

ఈ ఫీచర్ ప్రైవసీకి మరో లెవెల్ అని వాట్సప్ సంస్థ తెలిపింది.

తల్లి స్వీపర్.. సివిల్స్ లో సత్తా చాటిన కొడుకు.. ఇతని సక్సెస్ కు హ్యాట్సాఫ్ అనాల్సిందే!