నేడు న్యూజిలాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్.. ఇరు జట్ల బలాబలాలు ఇవే..!

వన్డే వరల్డ్ కప్( ODI World Cup ) లో భాగంగా పూణే వేదికగా నేడు న్యూజిలాండ్- దక్షిణాఫ్రికా మధ్య ఉత్కంఠ భరిత మ్యాచ్ జరుగనుంది.

ఈ టోర్నీలో న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా జట్లు 2,3 స్థానాల్లో ఉన్నాయి.అయితే ఈ మ్యాచ్ గెలవడం న్యూజిలాండ్ ( New Zealand )జట్టుకు ఎంతో ముఖ్యం.

ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు సెమీఫైనల్ దిశగా మరో బలమైన అడుగు వేస్తుంది.

ఓడిన జట్టుకు మిగతా జట్ల ఫలితాలు భారీ షాక్ ఇచ్చే అవకాశం ఉంది.

కాబట్టి రెండు వరుస ఓటములను చవిచూసిన న్యూజిలాండ్ జట్టు ఈ మ్యాచ్లో గెలిస్తే సెమీస్ చేరే అవకాశాలు మెండుగా ఉంటాయి.

"""/" / మ్యాచ్ జరిగే పిచ్ విషయానికి వస్తే.పూణే ( Pune )వేదికగా ఈ టోర్నీలో ఇప్పటివరకు రెండు మ్యాచ్లు జరిగాయి.

ఈ రెండు మ్యాచ్లలోను రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసిన జట్లే విజయం సాధించాయి.

ఇలాంటి పరిస్థితులలో పూణే వేదికపై టాస్ గెలిచిన జట్టు కచ్చితంగా మొదట బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.

"""/" / పిచ్ ఫాస్ట్ బౌలర్లకు చాలా అనుకూలంగా ఉంటుంది.పిచ్ పై బౌన్స్ కూడా బాగానే ఉంది.

కాబట్టి మొదట బ్యాటింగ్ చేసే జట్టు కాస్త ఇబ్బందులు పడాల్సి వస్తుంది.రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు పిచ్ అనుకూలంగా ఉంటుంది.

దీన్ని బట్టి చూస్తే టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్న జట్టు గెలిచే అవకాశాలు కాస్త ఎక్కువ.

ఇరుజట్ల బలబలాలు చూస్తే.న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా మధ్య ఇప్పటివరకు 71 వన్డే మ్యాచ్లు జరిగాయి.

అందులో సౌత్ ఆఫ్రికా ( South Africa )41, న్యూజిలాండ్ 25 మ్యాచ్లలో గెలిచాయి.

తటస్థ వేదికలపై జరిగిన 20 వన్డే మ్యాచ్లలో దక్షిణాఫ్రికా 12, న్యూజిలాండ్ 8 మ్యాచ్ లు గెలిచాయి.

నేడు జరిగే మ్యాచ్లో గెలుపు కోసం ఇరు జట్ల మధ్య చివరి వరకు ఉత్కంఠ పోరు జరగనుంది.

జుట్టు రాలడం, చుండ్రు రెండింటికి చెక్ పెట్టే ముల్తానీ మట్టి.. ఎలా వాడాలంటే?