వీసా రూల్స్‌ను కఠినంగా మార్చేసిన న్యూజిలాండ్.. కొత్త రూల్స్ ఇవే..
TeluguStop.com
న్యూజిలాండ్ ప్రభుత్వం తాజాగా తన ఉద్యోగ వీసా ( Employment Visa ) కార్యక్రమంలో కొన్ని ముఖ్యమైన మార్పులను ప్రవేశపెట్టింది.
ఈ మార్పులు 2024, ఏప్రిల్ 4 నుంచి అమలులోకి వచ్చాయి.ఈ కొత్త రూల్స్ ప్రకారం వీసా అభ్యర్థులు ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో( English Language ) కనీస నౌలెడ్జ్‌ని కలిగి ఉండాలి.
బేసిక్ ఇంగ్లీష్ మాట్లాడగలగాలి.లెవెల్ 4, 5 వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వలసదారులు ఆంగ్ల భాషలో కనీస నైపుణ్యాలను కలిగి ఉండాలి.
లేకపోతే ఇకపై వీసా పొందలేరు.కొన్ని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి, కనీస నైపుణ్యాలు, పని అనుభవం అవసరం.
లెవెల్ 4, 5 వీసాల కోసం వలసదారులను ( Migrants ) నియమించుకునే యజమానులు, వారికి కచ్చితమైన పని, జీతం ఇచ్చేలా చూసుకోవాలి.
ఈ నిబంధన వలసదారులను దోపిడీ నుంచి రక్షించడానికి తీసుకొచ్చింది.లెవెల్ 4, 5 పాత్రల కోసం గరిష్ట నిరంతర బస 5 ఏళ్ల నుంచి 3 ఏళ్లకు తగ్గించబడింది.
"""/" /
ఫ్రాంచైజీ అక్రిడిటేషన్ ముగిసింది.ఇకపై ఫ్రాంచైజీలకు ప్రత్యేక అక్రిడిటేషన్ అవసరం లేదు.
వ్యాపారాలు స్టాండర్డ్, హై-వాల్యూమ్ లేదా త్రిభుజాకార ఉపాధి అక్రిడిటేషన్ ద్వారా కార్మికుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇమ్మిగ్రేషన్ మంత్రి ఎరికా స్టాన్‌ఫోర్డ్( Immigration Minister Erica Stanford ) చెప్పిన న్యూజిలాండ్ వాసులకు ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం.
ఈ మార్పులు వీసా పథకం సమగ్రతను మెరుగుపరచడం, దోపిడీని నిరోధించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.
"""/" /
గత సంవత్సరం, సుమారు 173,000 మంది న్యూజిలాండ్‌కు( New Zealand ) వలస వచ్చారు, కాగా న్యూజిలాండ్ జనాభా 5.
1 మిలియన్లు.మహమ్మారి ముగిసినప్పటి నుంచి వలసదారుల పెరుగుదల ద్రవ్యోల్బణం గురించి ఆందోళనలను పెంచింది.
వలస దారుల తాకిడిని తగ్గించడానికి కూడా ఈ సవరించిన రూల్స్ హెల్ప్ అవుతాయి.
న్యూజిలాండ్ వెళ్లాలనుకునే భారతీయులు ఈ రూల్స్ కచ్చితంగా తెలుసుకోవాలి.అందుకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలి.
ప్రవాసీ భారతీయ దివస్ .. ఎన్ఆర్ఐలకు అడ్వైజరీ జారీ చేసిన ఒడిషా ప్రభుత్వం