తెలుగువారి బతుకమ్మ వేడుకల్లో ఆ దేశ మహిళా ప్రధాని..?!

ఒకవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దసరా పండుగ సందర్భంగా వివిధ ఆలయాల్లో అమ్మవారులను వివిధ ఆకృతులలో అలంకరించి పూజలను చేస్తున్నారు.

ఇక అందరికి తెలిసిన విధంగానే దసరా సమయంలో తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి.

ఇందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా బతకమ్మ పండుగను పెద్ద ఎత్తున జరిపించేందుకు సన్నాహాలు చేస్తుంది.

అయితే ఈ బతుకమ్మ పండుగకు ఎంతో ప్రాధాన్యత ఉంది.తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన తర్వాత ఈ పండుగను కేవలం తెలంగాణ రాష్ట్రం వరకు మాత్రమే కాకుండా విశ్వవ్యాప్తం చేశారు.

కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు మాత్రమే కాకుండా అమెరికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఇలా వివిధ దేశాలలో బతుకమ్మ పండుగను ఎంతో సంబరంగా జరుపుకుంటారు తెలుగు ప్రజలు.

ఈ పండుగను అక్కడ జరపడమే కాకుండా ఆయా దేశాల్లో ఉండే కొంతమంది అతిథులు కూడా పాల్గొంటున్నట్లు సమాచారం.

అయితే ఈ సారి కూడా ఓ ముఖ్య అతిధి ఈ బతుకమ్మ ఉత్సవాలకు హాజరుకానున్నారు.

ఇక ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.న్యూజిలాండ్ దేశం లో కూడా మన భారతీయులు అందులో ముఖ్యంగా తెలంగాణ ప్రాంత ప్రజలు ఎంతో మంది నివసిస్తున్నారు.

ఎప్పటిలాగే ఈసారి కూడా న్యూజిలాండ్ దేశంలో బతుకమ్మ కు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

బతుకమ్మకు పెద్ద ఎత్తున వేడుకలను నిర్వహించి అక్కడ అందరినీ ఆకట్టుకుంటున్నారు.అందరికీ తెలిసిన విధంగానే ప్రతిసారి న్యూజిలాండ్ దేశ ప్రధాని జెసిండా పాల్గొంటుంది.

తాజాగా న్యూజిలాండ్ దేశ ప్రధాని జెసిండా మరోసారి ఎన్నికలలో విజయం సాధించి ప్రధాని పీఠాన్ని కొనసాగిస్తున్నారు.

కాకపోతే, బతుకమ్మ వేడుకల్లో ఇదివరకు తెలుగు మహిళలతో కలిసి ఆవిడ ఆటపాట కలిసి ఆడారు.

బతుకమ్మకు ప్రత్యేక పూజలు కూడా చేశారు.అంతేకాదు తెలుగు వారు ఆశ్చర్యపడేలా బతుకమ్మ పండుగ పై ఆమె చాలా చక్కగా మాట్లాడారు.

ఈసారి కూడా ఆవిడ బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటున్నారని సమాచారం .అయితే న్యూజిలాండ్ దేశంలో జేసిండా కు మన తెలుగు వారి నుంచి ఎంతో మద్దతు ఉంది.

ఇదివరకు కూడా జెసిండా హిందూ సంప్రదాయాన్ని పాటించి ఆవిడ ఆలయంలోకి ప్రవేశించేముందు తన పాద రక్షలను ఆలయం బయటనే వదిలేసి లోపలికి వెళ్లడంతో ఆ సమయంలో అక్కడి భారతీయులందరూ జెసిండా చేసిన పని పై ప్రశంసల వర్షం కురిపించారు.

కాబట్టి ఈసారి కూడా బతుకమ్మ వేడుకల్లో జేసిండా పాల్గొనబోతోంది.

రానా లీడర్ 2 సినిమాలో హీరోయిన్ ఎవరంటే..?