నగరం నిండిపోయింది.. కొత్త వారికి ఛాన్స్ లేదు : వలసదారులపై న్యూయార్క్ మేయర్ సంచలన వ్యాఖ్యలు
TeluguStop.com
అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ మేయర్, డెమొక్రాట్ నేత ఎరిక్ ఆడమ్స్( Eric Adams ) వలసలు, వలసదారులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
న్యూయార్క్ నగరం నిండుకుందని, కొత్తగా ఇక్కడికి వచ్చే వారికి ఆశ్రయం, సేవలను అందించలేమన్నారు.
ఏప్రిల్ 2022 నుంచి న్యూయార్క్ సిటీ కొత్తగా 90,000 మంది వలసదారులకు స్వాగతం పలికిందని ఆడమ్స్ పేర్కొన్నారు.
నగరం నిండుకుందని కొద్దినెలల క్రితమే తాము చెప్పామని .సిటీలో ఇక స్థలం ఖాళీగా లేదని, మాకిప్పుడు సహాయం కావాలని మేయర్ విలేకరులతో అన్నారు.
"""/" /
అంతేకాదు.తన అభిప్రాయాలకు మద్ధతిచ్చే పోస్టర్‌లను ఆయన ప్రదర్శించారు.
న్యూయార్క్‌లో హౌసింగ్ చాలా ఖరీదైనదని ఆ పోస్టర్లలో పేర్కొన్నారు.న్యూయార్క్‌లో ఆహారం, రవాణా, ఇతర సదుపాయాలకు వెచ్చించే మొత్తం.
అమెరికాలోని( America ) మిగిలిన నగరాల కంటే ఎక్కువగా వుంది.వలస సంక్షోభాన్ని పరిష్కరించడానికి రూపొందించిన కొత్త ప్రణాళిక ప్రకారం.
ఒంటరి వయోజనులు 60 రోజులు మాత్రమే నగరంలోని షెల్టర్లలో వుండగలరు.ఆ తర్వాత కొత్తగా ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆడమ్స్ విలేకరుల సమావేశంలో ప్రకటించారు.
"""/" /
పొలిటికో నివేదిక ప్రకారం.ఫ్లోరిడా, టెక్సాస్, నార్త్ కరోలినా సహా దక్షిణ అమెరికా దేశాలు, చైనాతో తదితర దేశాలకు చెందిన వలసదారులకు న్యూయార్క్‌లో పునరావాసం ఏర్పాటు చేయడానికి ఏప్రిల్ 2022 నుంచి ఏప్రిల్ 2023 వరకు సుమారు 50,000 డాలర్లకు పైగా ఖర్చు చేశారు.
ఈ ఏడాది జూన్‌లో అమెరికా సరిహద్దుల్లో 1,44,000 మంది అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించారని కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ ( Customs And Border Protection )(సీబీపీ) గణాంకాలు చెబుతున్న నేపథ్యంలో ఆడమ్స్ ప్రకటన కలకలం రేపుతోంది.
అయితే ఇమ్మిగ్రేషన్ గణాంకాలు మాత్రం మునుపటి జూన్, మే లతో పోలిస్తే తగ్గాయి.
ఫిబ్రవరి 2021 తర్వాత అమెరికాలో వలసదారులు అడుగుపెట్టడం ఇదే అత్యల్పం.మరి అడమ్స్ వ్యాఖ్యలపై ఇప్పటికే న్యూయార్క్‌లో ఆశ్రయం పొందుతున్న వారు, ఇక్కడికి రావాలని ప్లాన్ చేసుకుంటున్న వారు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
మెడ తెల్లగా మృదువుగా మెరిసిపోవాలా.. అయితే ఈ రెమెడీ మీకోసమే!