తగ్గేదేలే అంటున్న న్యూయార్క్ మేయర్.. సంతోషం వ్యక్తం చేస్తున్న చిత్ర బృందం?
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా హీరోగా క్రేజ్ సొంతం చేసుకున్నారు.
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక జంటగా నటించిన ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 17వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమా భారీ స్థాయిలో విజయం అందుకుంది ఇకపోతే ఈ సినిమాలో ప్రతి ఒక్క డైలాగులకు పాటలకు విపరీతమైన ఆదరణ కూడా లభించిందని చెప్పాలి.
చిన్నపిల్లల నుంచి మొదలుకొని సెలబ్రిటీల వరకు సైతం పుష్ప డైలాగులు చెప్పడమే కాకుండా ఇందులో పాటలకు రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఇక ఈ సినిమా విడుదలై దాదాపు సంవత్సరం అవుతున్నప్పటికీ ఇంకా ఈ సినిమాకి ఏమాత్రం తగ్గలేదని తెలుస్తోంది.
తాజాగా అమెరికాలోని తెలుగు సంఘం నేతలు ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.దసరా బతుకమ్మ పండుగల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంతో ఈ కార్యక్రమంలో న్యూయార్క్ మేయర్ పాల్గొన్నారు.
ఇక ఈ కార్యక్రమానికి అనసూయ యాంకర్ గా వ్యవహరించారు. """/"/ఇక ఈ వేదికపై న్యూయార్క్ మేయర్ తగ్గేదేలే అంటూ పుష్ప సిగ్నేచర్ మూమెంట్ చేసి చూపించారు.
ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ వీడియోని న్యూయార్క్ ఆఫీస్ నుంచి ట్విట్టర్ లో షేర్ చేయగా ఈ వీడియో పై చిత్ర బృందం స్పందిస్తూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
భారతీయ చిత్రంపై మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు.యాంకర్ అనసూయ మంగ్లీ ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేసినందుకు అభినందనలు అంటూ చిత్రబృందం స్పందించారు.
ఇక ఈ సినిమాలో అనసూయ కూడా కీలక పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే.
ప్రవాసీ భారతీయ దివస్ .. ఎన్ఆర్ఐలకు అడ్వైజరీ జారీ చేసిన ఒడిషా ప్రభుత్వం