పోలీసులపై వలసదారుల దాడి .. న్యూయార్క్ గవర్నర్ సీరియస్ , ‘‘బహిష్కరణ’’పై ఫోకస్
TeluguStop.com
అక్రమ వలసదారులు, నిరాశ్రయుల కారణంగా అమెరికాలో( America ) శాంతిభద్రతలు గతి తప్పుతున్న సంగతి తెలిసిందే.
హత్యలు, దొంగతనాలు, బెదిరింపులతో పాటు డ్రగ్స్ వాడకం కూడా ఎక్కువవుతున్నాయి.తాజాగా రెండు రోజుల క్రితం అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్‌లోని( New York ) ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ వద్ద పోలీస్ అధికారులపై అక్రమ వలసదారులు( Illegal Migrants ) దాడి చేసిన ఘటన కలకలం రేపింది.
ఈ ఘటనను న్యూయార్క్ రాష్ట్ర గవర్నర్ కాథీ హోచుల్( Governor Kathy Hochul ) తీవ్రంగా పరిగణించారు.
పోలీసులపై దాడికి పాల్పడిన వారిని బహిష్కరించాలని రిపబ్లికన్ నేతలు డిమాండ్ చేస్తున్నారని.ఇది ఖచ్చితంగా పరిగణనలోనికి తీసుకోవాల్సిన విషయమేనని హోచుల్ అభిప్రాయపడ్డారు .
దాడి ఎలా జరిగిందనే దానిపై తాను సంతృప్తి చెందలేనని, ఈ పరిస్ధితి తనకు అసహ్యంగా వుందని కాథీ హోచుల్ వ్యాఖ్యానించారు.
"""/" /
న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం .జనవరి 31న గవర్నర్ విలేకరులతో మాట్లాడుతూ.
తన ఉద్దేశంలో ఎవరైనా సరే న్యూయార్క్‌లో ఒక పోలీస్ అధికారిపై( Police Officer ) నేరానికి పాల్పడితే వారు చట్టబద్ధంగా ఇక్కడి నివాసితులు కాకుంటే, అది ఖచ్చితంగా తనిఖీ చేయదగినదేనని కాథీ హోచుల్ అన్నారు.
పోలీసులు చట్టాన్ని అమలు చేసే అధికారులని, వారు ఎట్టిపరిస్ధితుల్లోనూ భౌతికదాడికి గురికాకూడదని ఆమె పేర్కొన్నారు.
గవర్నర్ అధికార ప్రతినిధి ప్రకారం.ఆమె కార్యాలయం సంఘటనపై మన్‌హట్టన్ జిల్లా ఆల్విన్ బ్రాగ్ కార్యాలయంతో కమ్యూనికేట్ చేసినట్లు తెలిపారు.
రాష్ట్ర చట్టం ప్రకారం.పోలీస్ అధికారిపై దాడి చేయడం బెయిల్ అర్హత కలిగిన నేరమని, జిల్లా న్యాయవాదులు నేరస్తులను జవాబుదారీగా వుంచడం చాలా క్లిష్టమని ఆయన వ్యాఖ్యానించారు.
"""/" /
ఘటన వివరాల్లోకి వెళితే.న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు( New York Police Department ) చెందిన ఇద్దరు పోలీస్ అధికారులు గత వారం మాన్‌హట్టన్ వెస్ట్ 42వ వీధిలో వలస వచ్చినవారిని అడ్డుకుని ప్రశ్నిస్తున్నారు.
కాసేపటికీ ఆ గుంపులోని మిగిలిన వలసదారులు కూడా అక్కడికి చేరుకుని పోలీసులపై మూకుమ్మడిగా దాడి చేసి వారి తల, శరీరంపై విచక్షణారహితంగా కొట్టారు.
ఈ ఘటనకు సంబంధించి నలుగురు దుండగులను పోలీసులు అరెస్ట్ చేశారు.వీరిని డార్విన్ ఆండ్రెస్ గోమెజ్ ఇజ్క్వియెల్ (19), కెల్విన్ సర్వత్ అరోచా (19), జుయారెజ్ విల్సన్ (21), యోర్మాన్ రెవెరాన్ (24)గా గుర్తించారు.
వీరిపై దాడికి పాల్పడినట్లుగా అభియోగాలు మోపగా, ఆ వెంటనే ఎలాంటి బెయిల్ లేకుండా విడుదల చేశారు.
కాసేపటికీ మరో అనుమానితుడు ఝెూన్ బోడా (22)ను కూడా అరెస్ట్ చేసి కేసులు నమోదు చేశారు.
స్టార్ హీరో ప్రభాస్ కాలికి గాయం.. ఈ స్టార్ హీరో త్వరగా కోలుకోవాలంటున్న ఫ్యాన్స్!