ప్రపంచాన్ని కలవరపెడుతోన్న కొత్త వేరియంట్ : న్యూయార్క్‌లో ఎమర్జెన్సీ విధించిన గవర్నర్

ప్రపంచానికి కోవిడ్ ముప్పు తప్పడం లేదు.ఎప్పటికప్పుడు కొత్త వేరియంట్ల రూపంలో సరికొత్త శక్తిని పుంజుకుని మహమ్మారి విరుచుకుపడుతోంది.

తాజాగా ఈ వారం ప్రారంభంలో దక్షిణాఫ్రికాలో కొత్త కరోనా వేరియంట్ బయటపడింది.దీనిని B.

1.1.

529 అని వ్యవహరిస్తున్నారు.ఇది గతంలో వాటికన్నా చాలా వేగంగా ఉత్పరివర్తనం చెందింది.

ఇది "చాలా భయంకరమైనదని" ఇప్పటివరకు వెలుగు చూసిన వేరియంట్లలో అత్యంత దారుణమైందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

దీంతో పలు దేశాలు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తమ సరిహద్దులను మూసివేయడంతో పాటు విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తున్నాయి.

ఇప్పటికే దక్షిణాఫ్రికా, దాని చుట్టుపక్కలున్న దేశాల నుంచి విమానాల రాకపోకలపై బ్రిటన్, సింగపూర్, జపాన్, ఇటలీ, ఫ్రాన్స్, మొజాంబిక్‌లు తాత్కాలికంగా నిషేధం విధించాయి.

ఈ నేపథ్యంలో అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్ర ప్రభుత్వం కూడా కొత్త వేరియంట్ పట్ల అప్రమత్తమైంది.

ఈ మేరకు గవర్నర్ క్యాథీ హోచుల్ రాష్ట్రంలో అత్యవసర పరిస్ధితిని ప్రకటించారు.2020లో కోవిడ్ వల్ల వేలాది మరణాలను చూసిన న్యూయార్క్‌లో కొత్త వేరియంట్ నేపథ్యంలో డిసెంబర్ 3 నుంచి ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.

అయితే గతంతో పోలిస్తే అవి అంత కఠినంగా లేవు.త్వరలో శీతాకాలం రానుండటంతో కోవిడ్ కేసులు మరింత పెరిగే అవకాశం వుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అయితే న్యూయార్క్ రాష్ట్రంలో కొత్త వేరియంట్ జాడ కనుగొనబడనప్పటికీ అప్రమత్తంగా వుండాలని గవర్నర్ డెమొక్రాట్ హోచుల్ ఒక ప్రకటనలో తెలిపారు.

వైరస్ కట్టడిలో టీకా సమర్ధవంతంగా పనిచేస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.మరోవైపు న్యూయార్క్‌లో కరోనా నిర్థారణ పరీక్షల్లో పాజిటివ్‌ల శాతం ఇటీవల రోజుల్లో పెరుగుతోంది.

టీకా రేట్లు మెరుగుపడినప్పటికీ.కొన్ని కౌంటీల్లో 10 శాతం కంటే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి.

న్యూయార్క్ టైమ్స్ గణాంకాల ప్రకారం.థాంక్స్ గివింగ్ డేకి ముందు రెండు వారాలలో, న్యూయార్క్‌లో రోజువారీ కేసుల సంఖ్య 37 శాతం పెరిగి 6,666కి చేరుకుంది.

కరోనా వెలుగు చూసిన నాటి నుంచి నేటి వరకు 56,000 మందికి పైగా వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయారు.

సింహాచలం చేరుకున్న అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్న సీఎం రమేష్