అమెరికాలో సిక్కు యువకుడిపై విద్వేష దాడి.. కదులుతున్న బస్సులోనే దురాగతం, రంగంలోకి పోలీసులు

సిక్కులు( Sikh ) తమ మత విశ్వాసాలను తూచా తప్పకుండా పాటిస్తారు.ప్రాణాలు పోయినా సరే వాటిని విడిచిపెట్టరు.

తలపాగా, గడ్డం, చిన్న కత్తి అన్నవి సిక్కు మతాన్ని అనుసరించే మగవాళ్లు ఖచ్చితంగా ఫాలో అవుతారు.

ఏ దేశమేగినా ఎందుకాలిడినా సిక్కు మతస్తులు తమ సంస్కృతీ సంప్రదాయాలను( Traditions ) ఏమాత్రం మరచిపోరు.

విడిచిపెట్టరు.విదేశాలలో స్థిరపడి ఉన్నతస్థాయిలోకి చేరుకున్నా సరే వారి మూలాలను ఏమాత్రం వదలరు.

అయితే ఈ కట్టుబాట్లే ఒక్కొక్కసారి వీరిని సమస్యలకు గురిచేస్తున్నాయి.ఈ నేపథ్యంలోనే పలు దేశాల్లో తమకు ప్రత్యేక గుర్తింపు కేటాయించాలని సిక్కులు ఆందోళనలు చేస్తున్నారు.

ఈ క్రమంలో సిక్కులపై విద్వేష నేరాలు ఎక్కువవుతున్నాయి.ఇటీవలి కాలంలో పలు సంస్థలు విడుదల చేసిన నివేదికల్లో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

అమెరికాలో యూదుల తర్వాత అత్యధికంగా విద్వేష నేరాలకు గురయ్యేది సిక్కులేనట. """/" / తాజాగా న్యూయార్క్( New York ) నగరంలోని మెట్రోపాలిటిన్ ట్రాన్స్‌పోర్టేషన్ అథారిటీ (ఎంటీఏ) బస్సులో ఒక వ్యక్తి 19 ఏళ్ల సిక్కు యువకుడిపై భౌతికదాడికి దిగడమే కాకుండా.

అతని తలపాగాను తొలగించేందుకు యత్నించాడు.ఈ ఇద్దరు వ్యక్తులు ఆదివారం ఉదయం రిచ్‌మండ్ హిల్‌లోని లిబర్టీ అవెన్యూ( Liberty Avenue In Richmond Hill ) సమీపంలో షటిల్ బస్సులో ప్రయాణిస్తున్నారని పోలీసులు తెలిపారు.

యువకుడిపై దాడి చేసిన అనంతరం నిందితుడు బస్సు దిగి పారిపోయాడు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న న్యూయార్క్ సిటీ పోలీస్ డిపార్ట్‌మెంట్ రంగంలోకి దిగింది.

నిందితుడి ఆచూకీని కనుగొనేందుకు సహాయం చేయాలని ప్రజలను కోరింది. """/" / నిందితుడికి 25 నుంచి 35 ఏళ్ల వయసు వుంటుందని.

ముదురు రంగు శరీర ఛాయతో సన్నగా వున్నాడని తెలిపింది.అతను 5 అడుగుల 9 అంగుళాల ఎత్తు వుంటాడని చెప్పింది.

దుండగుడి దాడిలో గాయపడిన బాధితుడు వైద్య సాయాన్ని నిరాకరించాడని పోలీసులు తెలిపారు.ఈ ఘటనపై అమెరికాలోని సిక్కు సంస్థ( Sikh Community ) దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

అతనికి అవసరమైన సాయం చేస్తామని, ప్రస్తుతానికి ఆ యువకుడు అజ్ఞాతంలో వున్నాడని సిక్కు కూటమి చెప్పింది.

ఈ ఘటనను న్యూయార్క్ పోలీసులు విద్వేష నేరంగా పరిగణించి దర్యాప్తు చేస్తున్నారని , బాధితుడి కుటుంబం అతని భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తోందని సిక్కు సంస్థ వెల్లడించింది.

యువకుడు తీవ్రంగా గాయపడ్డాడని.కొద్దిరోజులు పనిచేయలేదని పేర్కొంది.

థియేటర్ లో మహేష్ మురారి మూవీ చూస్తూ పెళ్లి చేసుకున్న జంట.. ఏం జరిగిందంటే?