ఫలించిన రెండు దశాబ్ధాల పోరాటం.. దీపావళికి న్యూయార్క్‌లో స్కూళ్లకు సెలవు, మేయర్ అధికారిక ప్రకటన

భారతీయుల పండుగలలో దీపావళి( Diwali ) ప్రత్యేకమైంది.చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళిని జరుపుకుంటారనేది పురాణ ప్రాశస్త్యం.

దీపావళి పండుగ అనగానే మనం తెలియకుండానే చిన్నతనంలోకి వెళ్లి పోతాం.జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివాళీ.

ఇప్పుడు ఇది సర్వజన ఆనందకేళిగా మారిపోయింది.భారతదేశంతో పాటు ఇతర దేశాల్లోనూ వెలుగుల పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు.

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాల్లో స్థిరపడిన భారతీయులు.దీపావళి ఖ్యాతిని ఖండాంతరాలు దాటించారు.

తద్వారా మనదేశంలో జరుపుకునే రోజే దాదాపు అన్ని దేశాల వారు దివాళీని జరుపుకుంటున్నారు.

ఇక మనకు మరో ఇల్లుగా మారిన అమెరికా( America ) సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఏకంగా అగ్రరాజ్యాధినేత కొలువుండే వైట్‌హౌస్‌లోనే దీపావళీ వేడుకలు జరుగుతాయి.మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌లు( President Joe Biden ) శ్వేతసౌధంలో దీపాలు వెలిగించి దీపావళిని జరుపుకున్నారు.

అలాగే 2016లో దీవాళీకి తపాలా బిళ్ళను కూడా అమెరికా విడుదల చేసింది. """/" / ఈ క్రమంలో మన దివ్వెల పండుగ దీపావళికి అరుదైన గుర్తింపు లభించింది.

అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్‌లో ఈ రోజున స్కూళ్లకు సెలవు ఇవ్వనున్నారు.ఈ మేరకు నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్( New York City Mayor Eric Adams ) సోమవారం అధికారికంగా ప్రకటించారు.

ఈ నిర్ణయం వచ్చే ఏడాది నుంచి అమల్లోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు.

ఎప్పటి నుంచో పెండింగ్‌లో వున్న ఈ డిమాండ్‌పై నిర్ణయాన్ని కలిసికట్టుగా తీసుకున్నట్లు ఆడమ్స్ పేర్కొన్నారు.

"""/" / దీంతో దక్షిణాసియా వాసులు ముఖ్యంగా ప్రవాస భారతీయులు రెండు దశాబ్ధాలుగా చేస్తున్న పోరాటానికి ప్రతిఫలం దక్కినట్లయ్యింది.

ఇందుకోసం న్యూయార్క్ అసెంబ్లీ సభ్యురాలు, భారత సంతతికి చెందిన జెనిఫర్ రాజ్‌కుమార్‌ ఎంతో కృషి చేశారు.

అయితే న్యూయార్క్‌లోని స్కూళ్లకు దీపావళి నాడు సెలవు ప్రకటించినప్పటికీ.ఈ ఏడాది మాత్రం అది అందుబాటులో వుండదు.

ఈ విద్యా సంవత్సరం ఇప్పటికే ఆరంభమైన నేపథ్యంలో వచ్చే ఏడాది నుంచి దీపావళి నాడు సెలవు అమల్లోకి రానుంది.

న్యూయార్క్ గవర్నర్ కేథీ హోచుల్ ఈ బిల్లుపై సంతకం చేసిన అనంతరం నగరంలోని స్కూళ్లకు దీపావళి నాడు అధికారిక సెలవు అమల్లోకి రానుంది.

పిల్లల కోసం అమెరికన్ తల్లి చేసే ఇండియన్ వంటలు చూస్తే నోరూరిపోతుంది!