డ్రీమర్స్ కు కూడా ఓటు హక్కు... న్యూయార్క్ మేయర్ డేరింగ్ డెసిషన్...!!

ఓటు హక్కు.వినడానికి చాలా చిన్న మాట అనిపిస్తుంది, కానీ ఒక్క ఓటు కొందరు రాజకీయ నేతల తలరాతలను మార్చేస్తుంది, బలంగా నిర్మించుకున్న పార్టీలను సైతం కుప్ప కూల్చేస్తుంది, అందుకే రాజకీయ నేతలు ఎప్పుడు ఎలా ప్రజలతో వ్యవహరించినా ఎన్నికల ముందు మాత్రం ఇంట్లో వాళ్ళకంటే బయటి వాళ్ళే తమ సొంత వాళ్ళు అనేంత బిల్డప్ లు ఇస్తుంటారు.

మనిషి సరిగా తన ఓటు హక్కును ఉపయోగించుకుంటే ప్రజల తలరాతలు మారిపోతాయి అంటారు.

సరే ఇలాంటి రాజకీయాలు ప్రపంచ వ్యాప్తంగా సర్వ సాధారణమే అయితే దేశం కాని దేశంలో ఏళ్ళ తరబడి ఉంటూ వలస వాసులుగా ముద్ర పడిన వారికి ఓటు హక్కు కల్పించడం అంటే మాములు విషయం కాదు, వారికి కూడా ఓటు హక్కు కల్పించి ఆయా దేశాల తలరాతలపై వలస వాసుల ముద్ర ఉండాలని ఎవరు అనుకుంటారు చెప్పండి.

కానీ అగ్ర రాజ్యం అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రంలో మాత్రం వలస వాసులకు ఓటు హక్కు కల్పించాలని అనుకోవడం సంచలన నిర్ణయమే.

"""/" / అమెరికా పౌర సత్వం లేని వారికి కూడా ఓటు హక్కు కల్పిస్తూ న్యూయార్క్ రాష్ట్రం సంచలన నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు న్యూయార్క్ సిటీ తాజాగా ప్రకటన చేసింది.ఏరిక ఆడమ్స్ ఈ తాజా నిర్ణయంపై ఆమోద ముద్ర వేశారు.

ఇమ్మిగ్రెంట్స్ కు ఓటు హక్కు కల్పించడం వలన మన ప్రజాస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని, ఇదెంతో మంచి నిర్ణయమని సిటీ కౌన్సిల్ సభ్యులు ప్రకటించారు.

ఈ చట్టం వచ్చే న్యూయార్క్ మున్సిపల్ ఎన్నికల సమయం నుంచీ అమలవుతుందని ప్రకటించారు.

ఇదిలా ఉంటే న్యూయార్క్ మేయర్ తీసుకున్న నిర్ణయంతో దాదాపు 8 లక్షల మంది డ్రీమర్స్ త్వరలో ఓటు హక్కుని వినియోగించుకొబోతున్నారట.

మేయర్ ఎరిక్ తీసుకున్న నిర్ణయంపై డ్రీమర్స్ సంతోషం వ్యక్తం చేశారు.

దేవర సినిమాలో మెగా హీరో..ఇక ఫ్యాన్స్ కి పూనకాలే….