ట్రంప్ ని “ఢీ”...కొట్టడానికి నేను రె “ఢీ”..
TeluguStop.com
అమెరికా అధ్యక్ష్య ఎన్నికలల్లో ఈ సారి ట్రంప్ ఢీ కొట్టి మరీ అధ్యక్ష పదవి నుంచీ కిందకి దింపడానికి ఎంతో మంది డెమోక్రాటిక్ పార్టీ తరుపున బరిలోకి దిగుతున్నారు.
తాజాగా ట్రంప్ ని ఢీ కొట్టే సత్తా నాకే ఉంది అంటూ డెమోక్రాటిక్ పార్టీ నేత న్యూయార్క్ మేయర్ బిల్‌డె బ్లాసియో అన్నారు.
అధ్యక్ష ఎన్నికల్లో తానూ కూడా పోటీ చేయనున్నట్టుగా తెలిపారు.ఈ మేరకు ఓ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
నా స్వస్థలం న్యూయార్క్.నా రాజకీయ జీవితం ఇక్కడే మొదలయ్యింది.
ట్రంప్ కి ఎదురొడ్డి పోరాడగలిగే సత్తా నాకు మాత్రమే ఉందని అంటున్నారు.అమెరికా ప్రజల సహకారం ఉంటే ట్రంప్ ని గద్దె దించడం పెద్ద విషయం కాదని అంటున్నారు.
అంతేకాదు తన ప్రచార పర్వం కూడా ఆ వీడియోలో తెలిపారు.తన తొలి ప్రచారం లోవా, దక్షిణ కరోలినా నగరాల నుంచి మొదలు పెడుతానని తెలిపారు.
ఇదిలాఉంటే """/"/
బిల్‌డె బ్లాసియా కి 58 ఏళ్ళ వయస్సు, ఇప్పటికీ అమెరికా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు డెమోక్రటిక్ పార్టీ కీలక నేతగా ప్రజాధరణ చొరగోన్నారు.
2013 లో జరిగిన ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ తరుపున పోటీ చేసి గెలుపొందారు.
అయితే ఎంతో సీనియర్ మోస్ట్ నేతగా, రాజకీయ ఉద్దండుగిగా పేరున్న బిల్‌డె బ్లాసియా, ట్రంప్ పై ఎలాంటి పోరు చేపట్టనున్నాడో వేచి చూడాలి.
డాకు మహారాజ్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇదేనా.. వైరల్ అవుతున్న వార్తల్లో నిజమెంత?