జిల్లా కలెక్టర్ కు శుభాకాంక్షల వెల్లువ

రాజన్న సిరిసిల్ల జిల్లా: కొత్త సంవత్సరం ను పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతికి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

జిల్లా అదనపు కలెక్టర్ లు ఎన్ ఖీమ్యా నాయక్, పూజారి గౌతమి, జిల్లా ప్రజా పరిషత్ సీఈఓ గౌతమ్ రెడ్డి, ఆర్డీఓ లు ఆనంద్ కుమార్, మధు సూదన్,స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి గంగయ్య,డి ఆర్ డి ఓ నక్క శ్రీనివాస్, జిల్లా అడిట్ అధికారి స్వప్న, సీపీవో పిబీ శ్రీనివాస చారి,జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ డిపిఆర్ఓ మామిండ్ల దశరథం, ఎస్సీ కార్పొరేషన్ ఈ డి వినోద్, డీసీవో బుద్ధ నాయుడు, జిల్లా లేబర్ అధికారి రఫీ, జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్, జిల్లా బిసి అభివృద్ధి అధికారి మోహన్, జిల్లా ఉపాధి కల్పన అధికారి రాఘ వేంద్ర , డబ్ల్యు ఓ లక్ష్మి రాజం, జిల్లా పౌర సరఫరాల అధికారి జితేందర్ రెడ్డి,జిల్లా మైనారిటీ శాఖ ఓ ఎస్ డి సర్వర్ మియా, కలెక్టరెట్ పరిపాలన అధికారి రామ్ రెడ్డి , కలెక్టరెట్ అధికారులు,సిబ్బంది పలువురు ప్రజా ప్రతినిధులు, పుర ప్రముఖులు, ప్రజలు మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి నీ కలిసి పుష్ప గుచ్చాలు , మొక్కలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

డోర్స్ అధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు.కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్.

హాజరైన జిల్లా అదనపు కలెక్టర్ లు ఎన్ ఖీమ్యా నాయక్, పూజారి గౌతమి.

కొత్త సంవత్సరం మరింత ఉత్సాహంతో అధికారులు పనిచేయాలి: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి.

డోర్స్ అధ్వర్యంలో మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నూతన సంవత్సర వేడుకలు జరిగాయి.

ఈ వేడుకలకు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.జిల్లా అదనపు కలెక్టర్ లు ఎన్ ఖీమ్యా నాయక్, పూజారి గౌతమి లతో కలిసి కేక్ కట్ చేశారు.

జిల్లా అధికారులకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు.కొత్త సంవత్సరం మరింత ఉత్సాహంతో అధికారులు పనిచేసి.

ప్రభుత్వ పథకాల ఫలాలు చివరి గడపకు చేరేలా చూడాలన్నారు.

నారా రోహిత్ కి ఆ పాపాల వల్లే ఇప్పటికీ పెళ్లి కాలేదా.. ఈ జన్మకు కాదంటూ?