'ఆర్ఆర్ఆర్'కు మరొక గండం.. ఈసారి ఏమయ్యిందంటే ?

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్.ఈ సినిమాను టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కించాడు.

ఇందులో టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించారు.

అయితే ఈ సినిమా విడుదల చేయాలనీ చూసినప్పుడల్లా ఏదొక సమస్య వస్తూనే ఉంది.

పలు వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఈ సినిమా మార్చి 25న రిలీజ్ కానుందని ఇటీవలే ప్రకటించారు.

మొన్నటి వరకు కరోనా అడ్డంకిగా ఉంది.ఇక ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ సినిమాకు మరొక అడ్డంకి వచ్చేలా ఉంది.

ఈ సమస్య ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ మేకర్స్ ను కలవర పెడుతుంది.

సాధారణంగా మార్చి, ఏప్రిల్ లను పరీక్షా సీజన్ లను పరిగణిస్తారు.అందువల్ల పెద్ద సినిమాలు ఆ సమయంలో ఎక్కువుగా విడుదల కావు.

అయితే ఈ ఏడాది మాత్రం పరిస్థితులు మరింత క్లిష్టంగా ఉన్నాయి.ఇప్పటికే కోవిడ్ కారణంగా జనవరిలో చాలా విద్య సంస్థలు మూత బడ్డాయి.

తిరిగి తెరచిన తర్వాత మే వరకు సంస్థలను నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది.అంటే మార్చి, ఏప్రిల్ లో విద్యార్థులకు పరీక్షలు ఉంటాయి.

"""/" / పైగా మార్చి చివరి వారంలో లేదా ఏప్రిల్ మొదటి వారంలో ఐపీఎల్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది.

ఈసారి 10 జట్లతో టోర్నమెంట్ చాలా లాంగ్ ఉంటుంది.దీంతో ఇప్పుడు విద్యార్థులు పరీక్షలతో పాటు ఐపీఎల్ కూడా ఆర్ ఆర్ ఆర్ విడుదలకు గండంగా మారింది.

ప్రెసెంట్ ట్రేడ్ పండితులు సినిమాకి ఈ అవరోధాలు వస్తాయని అంచనా వేస్తున్నారు.వాటిని మరి ఈ సినిమా మేకర్స్ ఎలా అధిగమిస్తారో చూడాలి.

"""/" / ఇక ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుంటే.ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్నాడు.

ఈ సినిమాలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగణ్ కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

డివివి దానయ్య ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

సింగర్ నిఖిత గాంధీ పెద్ద మనసు .. రాజస్థాన్ ఎన్జీవో కోసం యూకేలో ప్రత్యేక ప్రదర్శన