చైనాలో కొత్త వైరస్..! తొలి మరణం

చైనాలో కొత్త వైరస్.! తొలి మరణం చైనా లో పుట్టి వివిధ దేశాలను వ్యాప్తి చెందిన కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అనుకున్న సమయంలో ఇప్పుడు మరో కొత్త వైరస్ వచ్చి పడింది.

అదే మంకీబి వైరస్.కూతురు నుంచి ఎక్కడి నుంచి మంకీ వైరస్తో మానవుల్లో తొలి కేసు నిర్ధారణ అయినట్టు చైనా వెల్లడించింది.

ఈ వైరస్ సోకిన వ్యక్తి పశు వైద్యుడు (54) మరణించినట్లు ప్రకటించింది.అతని సన్నిహితులకు మాత్రం ఎలాంటి లక్షణాలు లేవని వారందరూ సురక్షితంగానే ఉన్నట్లు చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది.

బీచ్సింగ్ కు చెందిన పశు వైద్యుడు తన పరిశోధనలో భాగంగా మార్చి నెలలో రెండు చనిపోయిన కోతుల శరీరాలను రెండు ముక్కలుగా చేసి పరీక్షించాడు.

అనంతరం ఆయన అనారోగ్యం బారిన పడ్డారని తోలతో వాంతులు, వికారం లక్షణాలతో ఆస్పత్రిలో చేరినట్టు తెలిపింది.

ఆరోగ్యం క్షీణించడంతో మే 27న ప్రాణాలు కోల్పోయినట్లు చైనా అధికారులు వెల్లడించారు.ఆయన మృతదేహాన్ని పరీక్షించగా మంకీ బి వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు వైద్యులు వెల్లడించారు.

చైనాలో మంకీ బి సోకిన ప్రాణాలు కోల్పోయిన తొలి వ్యక్తి ఆయనేనని చైనీస్ సి డి సి ( సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) ప్రకటించింది.

చైనాలో ఇంతకు ముందు ఎక్కడా ఈ వైరస్ సోకిన దాఖలాలు లేవని ఇది తొలి కేస్ అని వెల్లడించింది.

బివి గా పిలిచి మంకీ బి వైరస్ తొలిసారి మాకాక్స్ అనే కోతి జాతిలో 1932 లోనే గుర్తించారు.

ఇది కోతుల నుంచి నేరుగా శరీర ద్రవాల ద్వారా ఇతరులకు సంక్రమిస్తుంది.ఈ వైరస్ సోకితే మరణాలు రేటు 70 నుంచి 80 శాతం ఉంటుందని పేర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలో కోతులను సంరక్షణ చూసే వ్యక్తులు పలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

బత్తాయి తోటల్లో పురుగుల ఉధృతి నివారణకు సమగ్ర సస్యరక్షక చర్యలు..!