టీడీపీ జనసేన పొత్తు లో కొత్త ట్విస్ట్ ?  బీజేపీ సైతం ? 

గత కొంతకాలంగా జనసేన , టిడిపి పొత్తు విషయమై జోరుగా ప్రచారం నడుస్తూనే ఉంది.

దాదాపు ఈ రెండు పార్టీలు రాబోయే ఎన్నికల సమయం నాటికి అధికారికంగా పొత్తు పెట్టుకునే ఆలోచనలోనే ఉన్నాయి.

దీనికి సంబంధించి అనేక ప్రచారాలు నడుస్తున్నాయి.కాకపోతే జనసేనతో బీజేపీ పొత్తు రద్దు చేసుకున్న తర్వాతే ఈ పరిణామాలు చోటుచేసుకుంటాయని అందరూ అభిప్రాయపడుతున్నా, అసలు విషయం మాత్రం వేరే ఉందట.

బీజేపీని భాగస్వామి చేసుకుని మూడు పార్టీలు కలిసి ఉమ్మడిగా వైసీపీని ఎదుర్కోవాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు.

  అయితే తాజాగా బిజెపి వ్యవహారంపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందించారు.

బీజేపీతో కలిసి ఉంటామని వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీతో కలిసి పోటీ చేస్తానంటూ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.

ఒక వైపు బిజెపి జనసేన సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.ఎవరికి వారు విడివిడిగానే తమ పోరాటాలను చేస్తున్నారు.

దీంతో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉండదనే అభిప్రాయానికి అందరూ వచ్చేశారు.

ఇటువంటి సమయంలో నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.అయితే ఈ ప్రకటన టీడీపీలో ఆనందాన్ని కలిగిస్తోంది.

ఎందుకంటే  టిడిపి , బిజెపి,  జనసేన మూడు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలన్నదే చంద్రబాబు ఆలోచన.

పోటీ చేసి నష్టపోవడం కంటే ఉమ్మడిగా పోటీ చేసి అనుకున్న ఫలితాన్ని సాధించాలని ఆయన చూస్తున్నారు.

"""/"/ అలా జరిగితే 2014 ఉప ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయి అనే నమ్మకంతో చంద్రబాబు ఉన్నారు.

అందుకే బీజేపీ ఎంత దూరం పెడుతున్నా, మరింత దగ్గర అయ్యేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు.

ఇక ఇప్పుడు జనసేన బీజేపీ పొత్తు రద్దు అయితే టీడీపీ బీజేపీ కి దగ్గర అవ్వడం చాలా కష్టం.

కానీ జనసేన ద్వారా బీజేపీ ని ఒప్పించడం సులభం అనే అభిప్రాయంలో చంద్రబాబు ఉన్నారట.

కెనడా నుంచి ఇండియాకి వెళ్లి అల్లుడిని సర్‌ప్రైజ్ చేసిన మేనమామ..