భువనేశ్వరి, బ్రాహ్మణి కూడా జైలుకు వెళ్లే ఛాన్స్ ఉందా.. ఆ కేసు ప్రూవ్ అయితే వాళ్లకు ఇబ్బందేనా?

చంద్రబాబు( Chandrababu ) అరెస్ట్ కు సంబంధించి రోజుకో మలుపు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.

చంద్రబాబు బెయిల్ పై విడుదలైతే బాగుంటుందని టీడీపీ( TDP ) అభిమానులు భావిస్తున్నారు.

అయితే చంద్రబాబుపై మరికొన్ని కేసులు నమోదవుతూ ఉండటంతో ఆయన ఇప్పట్లో రిలీజయ్యే ఛాన్స్ లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

లోకేశ్ ను కూడా త్వరలో అరెస్ట్ చేసే ఛాన్స్ అయితే ఉందని ప్రచారం జరుగుతోంది.

అయితే భువనేశ్వరి, బ్రాహ్మణి( Bhuvaneshwari, Brahmani ) కూడా జైలుకు వెళ్లే ఛాన్స్ ఉందని సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.

ఇన్నర్ రింగ్ రోడ్ కుంభకోణం కేసులో లోకేశ్ పేరును ఇప్పటికే చేర్చిన సంగతి తెలిసిందే.

ఈ కేసులో హెరిటేజ్ ఫుడ్స్ సంస్థకు ( Heritage Foods )కూడా భారీగా లబ్ధి చేకూరిందని అనుమానాలు ఉన్నాయని తెలుస్తోంది.

ఈ ఆరోపణలు నిజమని తేలితే మాత్రం భువనేశ్వరి, బ్రాహ్మణి కూడా జైలుకు వెళ్లే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

"""/" / హెరిటేజ్ ఫుడ్స్ కు భారీగా లబ్ధి చేకూరే విధంగా టీడీపీ వ్యవహరించిందని ఆ సంస్థకు మేనేజ్ మెంట్ హోదాలో భువనేశ్వరి, బ్రాహ్మణి ఉండటంతో వీళ్లిద్దరికీ కూడా ఇబ్బందులు తప్పవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

2024 ఎన్నికల వరకు టీడీపీకి ఇబ్బందులు సృష్టించే దిశగా జగన్ సర్కార్ ముందడుగులు వేస్తోంది.

ఈ ప్రయత్నాల్లో జగన్ సర్కార్ ఎంతమేర సక్సెస్ అవుతుందో చూడాల్సి ఉంది. """/" / చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో టీడీపీలో నేతల చేరికలు ఆగిపోయాయి.

చంద్రబాబు విడుదల కాకపోతే మాత్రం పార్టీకి ఇబ్బందేనని చెప్పవచ్చు.టీడీపీ జనసేన పొత్తు ఫిక్స్ అయిన నేపథ్యంలో ఏ పార్టీ ఎన్ని స్థానాలలో పోటీ చేస్తుందనే ప్రశ్నకు జవాబులు దొరకాల్సి ఉంది.

జగన్ సర్కార్ తెలివిగా అడుగులు వేస్తుండగా ఆ పార్టీ ప్లాన్స్ ఎంతమేర వర్కౌట్ అవుతాయో చూడాల్సి ఉంది.

రాజమౌళికి జక్కన్న అని పేరు పెట్టింది ఎవరో తెలుసా… ఈ పేరు వెనుక ఇంత కథ ఉందా?