నన్ను గుర్తించండి మహాప్రభో.. ఆర్ఆర్ఆర్ నిర్మాతకు ఇంత కష్టం వచ్చిందా?

ఏదైనా సినిమాకు అవార్డ్ వస్తే మొదట ఆ సినిమా నిర్మాత పేరు ప్రధానంగా వినిపిస్తుంది.

ఏ సినిమాకు అయినా నిర్మాతే అన్నీ తానై వ్యవహరిస్తారు.అయితే ఆర్ఆర్ఆర్ మూవీ(RRR) విషయంలో మాత్రం భిన్నంగా జరుగుతోంది.

ఆర్ఆర్ఆర్ మూవీకి డీవీవీ దానయ్య (Danayya)నిర్మాత అనే సంగతి తెలిసిందే.ఈ సినిమా కోసం ఆయన భారీ స్థాయిలోనే ఖర్చు చేశారు.

కరోనా వల్ల ఈ సినిమా బడ్జెట్ ఊహించని రేంజ్ లో పెరిగింది.అయితే దానయ్య మాత్రం ఈ ప్రాజెక్ట్ విషయంలో ఖర్చుకు వెనుకాడకుండా ఖర్చు పెట్టారు.

అయితే సినిమా కోసం, ప్రమోషన్స్ కోసం ఖర్చు పెట్టిన దానయ్య మూవీ రిలీజైన తర్వాత ఆస్కార్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నా ఆ ఖర్చుకు సంబంధించి జోక్యం చేసుకోలేదు.

రాజమౌళి(Rajamouli), ఆయన సన్నిహితులు ఆస్కార్ కు అవసరమైన ఖర్చులు భరించారని ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.

"""/" / ఆస్కార్ అవార్డ్(Oscar Award) సమయంలో తన పేరు ఎవరూ ప్రస్తావించకపోవడంతో డీవీవీ దానయ్య ఒకింత ఫీలయ్యారని సమాచారం.

నన్ను గుర్తించండి మహాప్రభో అంటూ పరోక్షంగా దానయ్య కోరుకుంటున్నారని తెలుస్తోంది.దానయ్య కష్టం పగవాడికి కూడా రావద్దంటూ కొంతమంది సోషల్ మీడియా వేదికగా చేస్తున్న కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి.

ఆర్ఆర్ఆర్ నిర్మాతకు క్రెడిట్ దక్కకపోవడం మాత్రం వాస్తవం అని చెప్పవచ్చు. """/" / దానయ్య సోషల్ మీడియా ద్వారా వరుసగా నాటు నాటు సాంగ్(Natu Natu Song) కు ఆస్కార్ రావడంపై పోస్టులు పెడుతున్నా హీరోలు, ఇతరులు మాత్రం దానయ్య పేరును ట్యాగ్ చేయడం లేదు.

దానయ్యకు నిర్మాతగా 200 కోట్ల రూపాయల రేంజ్ లో లాభాలు వచ్చాయని తెలుస్తోంది.

దానయ్య భవిష్యత్తు ప్రాజెక్ట్ లు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా పవన్ తో దానయ్య ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

కార్యకర్తలకు వందనం .. జగన్ ను నమ్ముతారా ?