పాత గాడ్జెట్స్ మరలా వాడేలా సరికొత్త టెక్నాలజీ!

గత 8 ఏళ్ల క్రితం కిందటితో పోల్చితే నేడు ఎలక్ట్రానిక్ వేస్ట్( Electronic Waste ) అనేది విపరీతంగా పెరిగిపోతోంది.

ఇక అందులో కూడా ఫోన్స్ ఎక్కువగా ఉంటున్నాయని వినికిడి.కొత్త గాడ్జెట్ చేతికి రాగానే పాత గాడ్జెట్స్ ఏం చేస్తున్నాం? అనే విషయం ఆలోచిస్తేనే అర్ధం అయిపోతుంది.

ఇక దాదాపుగా చాలామంది కొత్త ఫోన్ కొన్న వెంటనే పాతది పక్కడ పడేస్తూ వుంటారు.

కానీ పాత ఫోన్లు, ల్యాప్‌టాప్స్, కెమెరాలను డొమెస్టిక్‌గా ఎన్నిరకాలుగా వాడొచ్చో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

స్మార్ట్ ఫోన్ని సెక్యూరిటీ కెమెరాగా మార్చుకోవచ్చని మీకు తెలుసా? ఈ సెటప్ కోసం ఒక ట్రైపాడ్ లేదా మౌంట్ అవసరం వుంటుంది.

ఆ తరువాత కెమెరా కోసం అవసరమైన యాప్ ఇన్‌స్టాల్ చేసుకుంటే చాలు.ఇదే సూత్రం ట్యాబ్లెట్స్‌కు కూడా వర్తిస్తుంది.

"""/" / ఈ మధ్య వస్తున్న చాలా ఫోన్లు, ట్యాబ్లెట్స్( Phones , Tablets ) వాటర్ ఫ్రూఫ్.

కాబట్టి వీటిని ఔట్‌డోర్స్‌లో కూడా చక్కగా వాడుకోవచ్చు.కాకపోతే పవర్ సప్లయ్ చూసుకోవాలి.

పాత ఫోన్, ట్యాబ్లెట్‌ను మీడియా రిమోట్‌లాగా కూడా వాడొచ్చు.ఇవే కాకుండా కొన్ని యాప్స్ స్పీకర్స్‌తో పాటు ఎన్నో సౌకర్యాలను ఇస్తున్నాయి.

ఇవి ఉంటే పాత ఫోన్ లేదా ట్యాబ్లెట్‌ను మీడియా రిమోట్ లేదా హబ్‌గా వాడుకోవచ్చన్నమాట.

పాత ఐపాడ్‌ను యాపిల్ టీవీతో జత చేస్తే షోస్, సినిమాలు చూడొచ్చు.అదే పాత ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌ను క్రోమ్‌కాస్ట్ డాంగిల్‌తో కలిపితే స్పోటిఫై లేదా యూట్యూబ్ స్ట్రీమింగ్ చేసుకోవచ్చు.

ఇలాచేయడం వల్ల మీ కొత్త ఫోన్ బ్యాటరీ లైఫ్ సేవ్ చేసుకోవచ్చు. """/" / అదేవిధంగా డీఎస్ఎల్ఆర్ కెమెరాను( DSLR Camera ) కొత్త మోడల్ రావడం వల్ల పక్కన పెట్టాల్సి వస్తే కనుక దాన్ని వెబ్ క్యామ్గా వాడుకోవచ్చు.

నిజానికి చాలా ల్యాప్‌టాప్‌లు వెబ్‌క్యామ్‌తో వస్తాయి.కానీ స్ట్రీమ్ వీడియోను హైక్వాలిటీలో ఇవ్వాలంటే ఈ టెక్నిక్ బాగా పనిచేస్తుంది.

ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లో ఉన్న కిండల్, కోబో యాప్స్‌లు ఇ-బుక్స్ చదివేందుకు కొనొచ్చు.ఈ రెండు యాప్స్ ఆడియో బుక్స్‌కు సపోర్ట్ చేస్తాయి.

అదేకాకుండా టెక్స్ట్, ఆడియో రెండింటికీ పనిచేస్తాయి.ఇ-రీడింగ్ వల్ల ఫోన్ లేదా ట్యాబ్లెట్స్ బ్రైట్ స్క్రీన్ కళ్లకు ఇబ్బందిగా మారొచ్చు.

ఆ సమస్యను ఫిక్స్ చేయాలంటే స్టాక్ ఆండ్రాయిడ్ ఫీచర్ నైట్ లైట్ ఆన్ చేసుకోవాలి.

అదే ఐఓఎస్‌లో అయితే నైట్ షిఫ్ట్ అనే ఫీచర్ ఎనేబుల్ చేసుకోవాలి.ఈ ఫీచర్స్ బ్లూ లైట్ ప్రభావం కళ్ల మీద తక్కువ పడేలా చేస్తాయి.

తొలి సినిమాలోనే పౌరాణిక పాత్రలో మోక్షజ్ఞ.. ఈ వార్త నిజమైతే ఫ్యాన్స్ కు గూస్ బంప్స్!