తమిళ దళపతి రాజకీయం మొదలు కాబోతుందా?

దక్షిణాది రాజకీయాల్లో సినిమాలకు రాజకీయాలకు విడదీయలేని అనుబంధం ఉంటుంది.ముఖ్యంగా సినిమాలలో మేరు నగధీరుడు అన్న ఇమేజ్ తెచ్చుకున్న చాలామంది రాజకీయాలలో కూడా ముఖ్యమంత్రులు అయ్యి సంచలనం సృష్టించిన చరిత్ర దక్షిణ బారత రాజకీయాలకు ఉంది.

సినిమా స్టార్ల పొలిటికల్ ఏంట్రీలకు రాజకీయాల్లో బీభత్సమైన అటెన్షన్ క్రియేట్ అవుతుంది.అయితే కొంతమంది అంచనాలకు మించి రాణించగా కొంతమంది మాత్రం అంచనాలు అందుకోలేక చతికల పడ్డ ఉదంతాలు కూడా మనకు కనిపిస్తూనే ఉన్నాయి.

అయితే ఇప్పుడు కోలీవుడ్ టాప్ త్రీ హీరోలలో ఒకరిగా నిలిచే దళపతి విజయ్( Vijay ) రాజకీయ అరంగేట్రానికి రంగం సిద్ధమవుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

విజయ పొలిటికల్ ఎంట్రీ పై ఎప్పటినుంచో లీకులు వస్తున్నప్పటికీ ఇప్పుడు లియో సక్సెస్ మీట్ లో ఆయన చేసిన వ్యాఖ్యలతో రాజకీయాల పట్ల ఆయన కూడా ఆసక్తిగా ఉన్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా సూపర్ స్టార్ అని పిలుస్తున్న అభిమానులతో తాను సూపర్ స్టార్ ని కాదని, తమిళనాడులో ఒక్కరే సూపర్ స్టార్ ఉన్నారని, తాను దళపతినని, ప్రజల దళపతిని, వారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ అరంగేట్రానికి సంబంధించినవే అంటూ విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

"""/" / ఇంతకుముందు కూడా ఆయన సినిమా రిలీజ్ ల సమయంలో కొన్ని రాజకీయ వివాదాలు రేగడం తో భవిష్యత్తు రాజకీయాల పట్ల ఆయన కూడా ఆసక్తి తో ఉన్నారని, అయితే సినిమా రంగంలో అగ్రస్థానంలో ఉండడంతో మరి కొంతకాలం సినిమాలలోనే ఉండి తరువాత రాజకీయ రంగంలోకి అడుగు పెట్టాలని భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది .

ఇంతకుముందు కూడా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్( Rajinikanth ) రాజకీయ ప్రవేశం పై భారీ ఎత్తున అంచనాలు కనిపించేవి.

"""/" / ఆయన ఆ దిశగా కొన్ని సభలు, సమావేశాలు కూడా ఏర్పాటు చేశారు.

మరికొద్ది రోజుల్లో పార్టీ పేరు ప్రకటిస్తున్నారు అనగా వ్యక్తిగత ఆరోగ్య కారణాలతో రాజకీయాల నుంచి విరమించుకున్నట్లుగా ప్రకటించి షాక్ ఇచ్చారు .

తెరవెనక ఏం జరిగిందో తెలియదు కానీ ఆయన మాత్రం అప్పటినుంచి రాజకీయాల నుంచి పూర్తిగా దూరం పాటిస్తున్నారు.

మరో టాప్ స్టార్ కమలహాసన్ మాత్రం రాజకీయాల్లో ప్రస్తుత ఎదురీదుతున్నారు .మరి తమిళ దళపతి విజయ్ రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి .

సందీప్ వంగా, నాగ్‌ అశ్విన్‌, హను రాఘవపూడి అసిస్టెంట్ డైరెక్టర్లుగా పని చేశారని మీకు తెలుసా…??