ఆ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్న టాలీవుడ్ హీరోస్.. ఇప్పుడు ఇదే ట్రెండ్!

సాధారణంగా ఒక ఇండస్ట్రీలో ఏదైనా ట్రెండ్ స్టార్ట్ అయితే దానిని చాలా మంది అనుసరిస్తుంటారు.

అలాగే ఏదైనా కాంబో సక్సెస్ ఫుల్ అయితే దానిని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటారు.

అలా ఇప్పుడు టాలీవుడ్ సినిమాల్లో ఒక ట్రెండ్ ను మనవాళ్ళు ఫాలో అవుతున్నారు.

తెలుగు స్టార్ హీరోలందరి సినిమాల్లో ఇదే ట్రెండ్ కనిపిస్తూ ఉంది.అదే టాలీవుడ్ హీరో - బాలీవుడ్ విలన్.

తెలుగు హీరోల సినిమాల్లో బాలీవుడ్ స్టార్స్ విలన్స్ గా మారిపోతున్నారు.ఈ మధ్య మన హీరోలు అనౌన్స్ చేసిన అన్ని కొత్త సినిమాల్లో బాలీవుడ్ కు చెందిన స్టార్స్ విలన్స్ గా పెట్టుకుంటున్నారు.

ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరో ఆదిపురుష్ సినిమాలో రావణాసురుడి పాత్ర( Adipurush )లో నటించారు.

ఇక ఇప్పుడు ఎన్టీఆర్ - కొరటాల దేవర సినిమాలో కూడా విలన్ గా కన్ఫర్మ్ అయ్యారు.

"""/" / అలాగే మరో స్టార్ సంజయ్ దత్ పేరు ఈ మధ్య బాగా వినిపిస్తుంది.

ఈయన ప్రభాస్ - మారుతి సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.అంతేకాదు మరో పాన్ ఇండియన్ స్టార్ హీరో సినిమాలో కూడా ఉన్నట్టు టాక్.

ఇక బాబీ డియోల్ కూడా హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu )సినిమాలో నటిస్తున్నాడు.

"""/" / ఇంకా అర్జున్ రాంపాల్ ఇప్పుడు రెండు సినిమాల్లో విలన్ గా కనిపిస్తున్నాడని తెలుస్తుంది.

అందులో హరిహర వీరమల్లు ఒకటి కాగా బాలయ్య - అనిల్ కాంబోలో కూడా నటిస్తున్నాడు.

నవాజుద్దీన్ సిద్ధిఖీ ( Nawazuddin Siddiqui )కూడా విలన్ గా ట్రై చేస్తున్నాడు.

సైంధవ్ సినిమాలో ఈయనే విలన్.ఇలా ఇప్పుడు ఈ ట్రెండ్ బాగా పాటిస్తున్నారు మన హీరోలు.

డ్రామాలొద్దు .. ఇమ్మిగ్రేషన్ విధానాలపై ట్రంప్‌కు షాకిచ్చేలా కమలా హారిస్ ప్రకటన