కొత్త ఏడాదిలో కొత్త కొత్త రూల్స్ ! జేబుకి చిల్లే
TeluguStop.com
కొత్త సంవత్సరం తొలిరోజు అందరిలోనూ చాలా హుషారే కనిపిస్తుంది.అయితే ఈ కొత్త ఏడాదిలో మాత్రం ఆ హుషారు ఆవిరయ్యే అయ్యే అవకాశం కనిపిస్తోంది.
ఎందుకంటే కొత్త కొత్త రూల్స్ కొత్త ఏడాది తొలి రోజు నుంచే అమల్లోకి రాబోతున్నాయి.
కొన్ని వస్తువుల ధరలు భారీగా పెరగనున్నాయి.దీంతో జనాల జేబుకి చిల్లు పడే పరిస్థితి కనిపిస్తోంది.
చాలా వస్తువుల ధరలు పెరగడంతో పాటు, బ్యాంకింగ్, సిమ్ కార్డ్స్ ,జీఎస్టీ వంటి విషయాల్లో భారీ మార్పులు ఉండబోతున్నాయి.
జనవరి ఒకటో తేదీ నుంచి ఎనిమిది విషయాల్లో కీలక మార్పులు జరగనున్నాయి.
గ్యాస్ సిలిండర్ల ధరలు, వాహనాలు ధరలు, ఇలా ఎన్నో పెరిగే అవకాశం కనిపిస్తుంది.
"""/" /
ఒక సంవత్సరం పాటు వాడకుండా ఉన్న యూపీఐ ఖాతాలు మూసివేయబడతాయి.
బ్యాంకులు, పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే వంటి థర్డ్ పార్టీ యాప్ లు కూడా జనవరి 1 నుంచి డి యాక్టివేట్ అవుతాయి.
ఏడాది పాటు ఎటువంటి లావాదేవీలు జరగని యూపీఐ ఐడి( UPI ID ) లను మాత్రమే డి ఆక్టివేట్ చేయనున్నారు.
ఇదంతా జనవరి 1 నుంచి అమల్లోకి రాబోతుంది.సెల్ సిమ్ కార్డ్ మార్పిడి కోసం కొత్త నియామకాలు కొత్త ఏడాది నుంచి అమల్లోకి రాబోతున్నాయి.
జనవరి ఒకటి నుంచి సిమ్ పొందడానికి డిజిటల్ కేవైసీ( Digital KYC ) ని పొందాల్సి ఉంటుంది.
టెలి కమ్యూనికేషన్ శాఖ పేపర్ ఆధారిత కేవైసీ ని నిలిపివేసిన నేపథ్యంలో, ఈ కొత్త రూల్ అమల్లోకి రానుంది.
ఐటీఆర్ ఫైలింగ్ కోసం జనవరి ఒకటి నుంచి పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.వాస్తవానికి ఆలస్యమైన ఐటిఆర్ రిటర్న్ ను ఫైల్ చేయడానికి డిసెంబర్ 31 చివరి తేదీ.
అటువంటి పరిస్థితుల్లో జనవరి ఒకటి నుంచి జరిమానాలు విధించనున్నారు. """/" /
పార్సిల్ సేవలు ప్రియం కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి పార్సెల్ పంపడం మరింత ఖర్చుతో కూడుకోబోతోంది.
ఓవర్సీస్, లాజిస్టిక్స్ బ్రాండ్, బ్లూ డార్ట్ పార్సెల్ పంపే రేటును 7 శాతం వరకు పెంచనుంది.
గ్యాస్ సిలిండర్ ధరల విషయంలోనూ జనవరి 1 నుంచి మార్కులు చోటు చేసుకోనున్నాయి.
ప్రతి నెల మొదటి తేదీన గ్యాస్ సిలిండర్ల ధరలను నిర్ణయించనున్నారు.అంటే కొత్త సంవత్సరం మొదటి రోజునే గ్యాస్ సిలిండర్ల ధరలపై ప్రకటన జారీ అయ్యే అవకాశం ఉంది.
వాహనాల ధరలు పెరగనున్నాయి జనవరి ఒకటి నుంచి దేశంలోని అనేక కార్ల కంపెనీలు వాహనాల ధరలను పెంచాలని నిర్ణయించాయి.
2024 నుంచి విదేశాలలో చదువుతున్న విద్యార్థులు ఉద్యోగం కోసం తమ చదువు ముగిసే లోపు వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి.
కొండపైకి ఎక్కుతూ జారిన మహిళ.. చివరకు? (వీడియో)