క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ వినియోగిస్తున్నారా.. మే నుంచి అమలులో ఉన్న కొత్త రూల్స్ ఇవే..!

ప్రస్తుత కాలంలో డెబిట్ కార్డులు( Debit Cards ), క్రెడిట్ కార్డులు వినియోగించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ పోతోంది.

కరోనా కారణంగా దాదాపుగా అన్ని లావాదేవీలు డెబిట్, క్రెడిట్ కార్డుల( Credit Cards ) ద్వారానే జరుగుతున్నాయి.

అయితే ఆర్థిక సంవత్సరం మార్చి ముగిసిన తర్వాత ఫైనాన్షియల్ కంపెనీలు కొత్త కొత్త రూల్స్ అమలు చేయడం అందరికీ తెలిసిందే.

ఈ క్రమంలో తాజా ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత డెబిట్, క్రెడిట్ కార్డుల లావాదేవీల చార్జీలలో కొత్త మార్పులు అందుబాటులోకి వచ్చాయి.

కాబట్టి బ్యాంకు ఖాతా కలిగి వివిధ రకాల కార్డులు ఉపయోగించేవారు ఈ కొత్త నూతన విధానాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం.

లేదంటే అనవసరంగా చార్జీల బాదుడుకు బలి కావాల్సిందే.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ లు క్రెడిట్, డెబిట్ కార్డుల చార్జీలు ఆఫర్ల విషయాలలో కొత్త రూల్స్ అమలు చేస్తున్నాయి.

కోటక్ మహేంద్ర బ్యాంక్ మే 22 నుంచి డెబిట్ కార్డు వినియోగంపై కొన్ని సవరణలు చేయనుంది.

ఆ మార్పులు ఏమిటో చూద్దాం.h3 Class=subheader-styleస్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా:( State Bank Of India )/h3p """/"/ ప్యూర్ ప్లే క్రెడిట్ కార్డ్ అందించే ఆరం కార్డుల్లో ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్( State Bank Of India Cards And Payment Services ) కొన్ని మార్పులు చేసింది.

ప్రస్తుతం ఆరమ్ క్రెడిట్ కార్డుదారులు టాటా క్లిక్ లగ్జరీ నుండి రూ.5వేల వోచర్ పొందుతున్న సంగతి తెలిసిందే.

గతంలో ఏడాదికి రూ.5 లక్షల క్రెడిట్ కార్డు ద్వారా ఖర్చు చేసిన వినియోగదారుడికి ఆర్బీఎల్ లగ్జరీ నుండి ఈ వొచర్ పొందేవారు.

కానీ ప్రస్తుతం ఆరం కార్డు ద్వారా వచ్చే ఈజీ డైైనర్ ప్రైమ్, లెన్స్ కార్డ్ గోల్డ్ మెంబర్షిప్ ప్రయోజనాలను తొలగించింది.

అంతేకాకుండా సింప్లీ క్లిక్ ఎస్బిఐ కార్డు, సింప్లీ క్లిక్ అడ్వాన్టేజ్ ఎస్బీఐ కార్డుదారులకు ఆన్లైన్ రెంట్ పేమెంట్ లపై వచ్చే రివార్డులను ఐదు నుంచి ఒకటికి తగ్గించింది.

క్యాష్ బ్యాక్ కార్డు వినియోదారులకు డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచ్( Domestic Airport Launch ) ప్రయోజనాలను కూడా తొలగించింది.

H3 Class=subheader-styleపంజాబ్ నేషనల్ బ్యాంక్:( Punjab National Bank ) /h3p """/"/ ఈ బ్యాంకు ఏటీఎంలలో క్యాష్ విత్ డ్రా చేయాలనుకుని, నగదు లేకుండా లావాదేవీలు ఫెయిల్ అయితే రూ.

10 ప్లస్ జీఎస్టీని బ్యాంకు వసూలు చేయనుంది.ఇంకా డెబిట్ కార్డ్ ఇన్సూరెన్స్( Debit Card Insurance ), ఫీజులను రివైజ్ చేస్తున్నట్లు బ్యాంక్ ప్రకటించింది.

H3 Class=subheader-style కొటక్ మహీంద్రా బ్యాంకు:( Kotak Mahindra Bank ) /h3p """/"/ ఈ బ్యాంకు క్రెడిట్ కార్డ్ చార్జీలను రూ.

259 ప్లస్ జీఎస్టీ వరకు పెంచి అమలు చేయనుంది.గతంలో అయితే డెబిట్ కార్డు పై చార్జీలు రూ.

199 ప్లస్ జీఎస్టీగా ఉండేవి.

అనిల్ రావిపూడి కెరియర్ లో సంక్రాంతికి వస్తున్నాం బిగ్గెస్ట్ హిట్ గా మారబోతుందా..?