ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్, బన్నీలకు కొత్త కష్టాలు.. అవి దొరకడం సులువు కాదంటూ?

బాహుబలి, బాహుబలి2 సినిమాలతో ప్రభాస్ కు పాన్ ఇండియా హీరోగా గుర్తింపు దక్కడంతో పాటు ప్రభాస్ నటిస్తున్న ప్రతి సినిమా పాన్ ఇండియా సినిమాగానే విడుదల కానున్న సంగతి తెలిసిందే.

అల్లు అర్జున్ కు పుష్ప ది రైజ్ ద్వారా జూనియర్ ఎన్టీఆర్, చరణ్ లకు ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది.

ఈ హీరోల సినిమాల బడ్జెట్లు సైతం ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయని తెలుస్తోంది.అయితే ఇదే సమయంలో ఈ స్టార్ హీరోలకు కొత్త కష్టాలు కూడా మొదలయ్యాయి.

ఒకప్పుడు దేశమంతటా హిందీ సినిమాల హవా నడిచినా గతంతో పోలిస్తే పరిస్థితి మారిందనే సంగతి తెలిసిందే.

సౌత్ డైరెక్టర్లలో రాజమౌళి, ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కించి విజయాలను సొంతం చేసుకుని ప్రూవ్ చేసుకున్నా చాలామంది డైరెక్టర్లు ఇంకా ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది.

అయితే ఈ పాన్ ఇండియా హీరోలకు పాన్ ఇండియా కథలు దొరకడం సులువు కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కొన్ని కథలు మాత్రమే భాషాభేదం లేకుండా అన్ని భాషల ప్రేక్షకులను మెప్పించే అవకాశాలు అయితే ఉంటాయి.

"""/"/ఈ పాన్ ఇండియా సినిమాలకు ఏ మాత్రం నెగిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్ల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

ప్రేక్షకుల అంచనాలకు అనుగుణంగా సినిమాను తెరకెక్కించి విజయం సాధించడం ప్రస్తుతం మేకర్స్ కు సవాల్ గా నిలిచింది.

"""/"/ అయితే కొలతలు వేసుకుని కథను రాయడం కూడా మంచిది కాదని దర్శకులు చెబుతున్నారు.

ప్రస్తుతం పాన్ ఇండియా ఒత్తిడిలో సినిమా ఇండస్ట్రీ ఉండటం గమనార్హం.భవిష్యత్తులో రిలీజయ్యే సినిమాలలో ఎన్ని సినిమాలు పాన్ ఇండియా హిట్లుగా నిలుస్తాయో చూడాల్సి ఉంది.

స్టార్ హీరోలు సైతం తమను మెప్పించే పాన్ ఇండియా కథల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ వారం థియేటర్ ఓటీటీ సినిమాలు ఇవే.. ఆ సినిమాపైనే అంచనాలు ఉన్నాయా?