రేవంత్‌రెడ్డిని టార్గెట్ చేస్తూ కొత్త రాజకీయం ?
TeluguStop.com
తెలంగాణలో సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీకి కొరకరాని కొయ్యగా ఉన్న రాజకీయ నేత ఎవరైనా ఉన్నారా ? అంటే ముందుగా ఫైర్‌బ్రాండ్ రేవంత్ రెడ్డి పేరే వినిపిస్తుంది.
గత సాధారణ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గంలో టార్గెట్ చేసి మరీ రేవంత్ రెడ్డిని ఓడించారు.
ఇందుకు టీఆర్ఎస్ అధిష్టానం ఎన్నో ప్రణాళికలు రచించింది.ఆ తర్వాత రేవంత్ లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరిలో గెలిచి అసలు సిసలైన నేత అనిపించుకున్నారు.
ఇప్పుడు రేవంత్ పీసీసీ రేసులో ఉండడంతో టీఆర్ఎస్ రేవంత్‌ను మళ్లీ ఎలా ? కట్టడి చేయాలా ? అని ప్లాన్ చేస్తోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ టీఆర్‌ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు.
"""/"/
ఆ తర్వాత మల్కాజ్‌గిరి ఎంపీగా గెలిచారు.ఇక ఇప్పుడు రేవంత్ పీసీసీ అధ్యక్షుడు అయ్యే ఛాన్సులు ఉండడంతో మళ్లీ తన సొంత నియోజకవర్గంపై కాన్‌సంట్రేషన్ చేశారు.
కొడంగల్లో టీఆర్ఎస్ గెలిచాక ఏ మాత్రం అభివృద్ధి జరగలేని ఆయన సవాళ్లు రువ్వుతున్నారు.
దీంతో ఆయన సవాళ్లు రువ్వుతున్నారు.ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి రేవంత్‌ను ఢీ కొట్టే విషయంలో వెనకంజలోనే ఉన్నా ఆయనకు పార్టీ అధిష్టానంతో పాటు మంత్రుల నుంచి పూర్తి అండదండలు ఉన్నాయి.
కేసీఆర్ నిధులు విడుదల చేస్తామని చెపుతున్నా ఆ స్థాయిలో ఇక్కడ పనులు లేవు.
అయితే సోషల్ మీడియాలో మాత్రం కొడంగల్ ను దత్తత తీసుకున్న కేసీఆర్ రూపు రేఖలు మార్చేస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.
రేవంత్ టీం మాత్రం అదంతా ఉత్తిదే అని ప్రచారం చేస్తున్నారు.తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే రెండున్నరేళ్లు అవుతోంది.
జమిలీ ఎన్నికలు వస్తే ఈ సారి మళ్లీ రేవంత్ కొడంగల్ నుంచే పోటీ చేస్తారు.
ఈ క్రమంలోనే కొడంగల్ లో తన పట్టు సడలకుండా చూసుకుంటున్నారట.అయితే పార్టీ అధిష్టానం మాత్రం మళ్లీ రేవంత్ అసెంబ్లీ మెట్లు ఎక్కకుండా ఉండాలని పట్టుదలతో ఉంది.
రేవంత్ మాత్రం ఇక్కడ నెట్ వర్క్ ఏర్పాటు చేసుకుని ఏం జరిగినా వెంటనే తెలుసుకుని స్పందిస్తున్నారు.
ఇక ఇప్పుడు రేవంత్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి సవాళ్లు, ప్రతి సవాళ్లతో కొడంగల్ రాజకీయం వేడెక్కుతోంది.
ప్రేమ పెళ్లి చేసుకున్న కూతురు.. బిడ్డను ఎలా చంపగలను? అంటూ తండ్రి సూసైడ్..!