దళితుల కోసం పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం బెజవాడలో ఆవిర్భవించిన మరో కొత్త పార్టీ..

దళితుల కోసం పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం మరో కొత్త పార్టీ బెజవాడలో ఆవిర్భవించింది.

జైభీమ్ భారత్ పార్టీ పేరుతో పేరుతో మాజీ జడ్జి జడ శ్రావణ్ కుమార్ పార్టీని నెలకొల్పి దాని ఆవిర్భావ సభను నిర్వహించారు విజయవాడలో జరిగిన సభకు పెద్ద ఎత్తున దళితులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ రాష్ట్రం లో పొలిటికల్ వాక్యూమ్ ఉందా అని ప్రశ్నించారు.

దళితుల కోసం పోరాడే పార్టీ ఒక్కటి కూడా రాష్ట్రం లో లేదన్నారు.

28 సంవత్సరాలకు న్యాయమూర్తి ని అయిన వ్యక్తిని పదేళ్ల లో ఆ పదవిని వదిలి ప్రజల కోసం వచ్చానని తెలిపారు.

రూపాయికి కిలో బియ్యం ఇచ్చి 200 రూపాయలకు ఆయిల్ ప్యాకేట్ ఇచ్చే పార్టీ లను మనం పొగుడుదామా? నిలదిద్దామా అని ప్రశ్నించారు.

దళిత బిడ్డలకు మేనమామ అని చెప్పిన జగన్.ఆ తరువాత చేసిన అన్యాయం ఎవ్వరు మర్చిపోరన్నారు.

వైసీపీ దుర్మార్గ పాలనను మనం ప్రశ్నించవద్ద అన్న ఆయన ఆ పార్టీ లోని దళిత నాయకులను ఓడించడానికే ఈ పార్టీ అన్నారు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు ప్రజలకు అన్యాయం చేసే వారిని ప్రశ్నిస్తామని తెలిపారు.

26 రకాల దళిత స్కీములు జగన్ రద్దు చేసాడని విదేశీ విద్య కోసం వెళ్లిన వారు ప్రభుత్వం నుండి నిదులు రాక ఇబ్బంది పడుతున్నారన్నారు.

ఒడిపో, ఓడించు, గెలువు అన్న కాన్షిరాం మాటలు మాకు స్ఫూర్తి కావాలన్నారు.

భోజనం తర్వాత ఈ మ్యాజికల్ లడ్డూ తింటే అజీర్తి, గ్యాస్ అన్న మాటే అనరు!